Oil Price Forecast: Goldman Sachs See Crude Hitting $20

Oil prices could hit us20 goldman

Oil Price Forecast, Goldman Sachs, Crude oil Hitting $20, oil price, oil price forecast, oil, goldman sachs, citi, oil price crash, crude oil per barrel, Oil prices could hit $US20

the Goldman Sachs Group, Inc. concludes that before the dust settles, the oil price might go as low as $20.00 per barrel.

అంతర్జాతీయంగా పడిపోతున్న క్రూడ్ అయిల్ ధరలు..

Posted: 09/13/2015 04:40 PM IST
Oil prices could hit us20 goldman

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పడిపోతున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గిన క్రూడ్ అయిల్ ధరలు ఇంకా 50 శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో గల్ఫ్‌ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌ లాంటి ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాలు పండుగ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ అంటే 159 లీటర్ల ముడిచమురు ధర 20 డాలర్లకు పడిపోవచ్చునని అంచనా? గత ఏడాది జనవరిలో 80 డాలర్ల మేర వున్న క్రూడ్ అయిల్ ధర.. ఏడాదిన్నర కాలంలోనే భారిగా పడిపోయింది. రమారమి సగం ధరలో కోనసాగుతోంది. ప్రస్తుతం బ్యారల్‌ ముడిచమురు ధర 45 డాలర్లుగా ఉంది. ఈ అంచనాలు చమురు ఉత్పత్తి దేశాల్లో కలవరం సృష్టిస్తున్నాయి.

మార్కెట్లో డిమాండ్‌కు మించి సప్లై ఉండడంతో ధరల తగ్గుదలపై కొత్త అంచనాలు వెలువడ్డాయి. ఏడాదిన్నర క్రితం 120 డాలర్లకు చేరిన ముడిచమురు ధర ఇప్పటికే 45 డాలర్లకు వచ్చేసింది. గత 12 నెలల్లో ముడిచమురు ధర 50 శాతం తగ్గింది. చైనా నుంచి ముడిచమురుకు డిమాండ్‌ తగ్గగా... ఇరాన్‌ నుంచి ముడిచమురు సరఫరా పెరిగింది. అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్‌ చమురు ఎగుమతులు ఊపందుకున్నాయి. అమెరికాలోనూ చమురు ఉత్పత్తి పెరిగింది. ముడి చమురు తగ్గడమంటే భారత్‌ లాంటి దేశాలకు శుభపరిణామమే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oil Price Forecast  Goldman Sachs  Crude oil Hitting $20  

Other Articles