LG G4 first impressions: Snapdragon 808 SoC, handcrafted leather back, 16MP camera and more

Lg g4 flagship phone goes official for rs 51000

LG , latest flagship phone, LG G4, NSCI Sports Complex, Mumbai, Bollywood megastar Amitabh Bachchan, big B, innovative features, LG, G4, Amitabh Bachchan, new, smartphone, gadget, mobile, phone, Radioandmusic.com, RnM

LG launched its latest flagship phone – the LG G4 – at the NSCI Sports Complex in Mumbai which was relatively packed by media persons and guests, despite the heavy Mumbai rains.

భారతీయ విఫణిలోకి సరికోత్త ఫీచర్స్ తో ఎల్జీ జీ4 4జీ స్మార్ట్ ఫోన్

Posted: 06/21/2015 06:49 PM IST
Lg g4 flagship phone goes official for rs 51000

దక్షిణ కోరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్ జీ, భారతీయ విఫణిలోకి మరో సరికొత్త ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఎల్ జి జీ4 అనే కోత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే సామాన్యలకు అందని ధరనే నిర్థేశించింది. కాగా, ఈ ఫోన్ లో కెమెరా మెగా పిక్సెల్ సహా పలు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఇప్పటికే పలు టెలికామ్ ప్రోవైడర్లు 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో.. మార్కెట్లోకి తమ ఫోన్లను కూడా అంతే త్వరగా తీసుకెళ్లాలని యోచించిన ఎల్జీ.. 4జీ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా ఈ 4జీ ఫోన్ ధర 51 వేల రూపాయలుగా సంస్థ నిర్థారించింది. అండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ రేర్ కెమెరా,  8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1,8 గిగాహెర్ట్జ్ హెక్జాకోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, 3 జీబి ర్యామ్ తదితర ప్రత్యేకతలు వున్నాయి. కంపెనీ ఈ ఏడాది చివరి వరకు లక్ష యూనిట్ల ఎల్ జీ జీ4 స్మార్ట్ ఫోన్లను విక్రయించాలని నిర్ణయించుకుంది. అలాగే మొబైల్ మార్కెట్ వాటాను 10 శాతానికి పెంచుకోవాలని సంస్థ మార్కెటింగ్ అధికారులు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు సమాచారం.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LG  G4  Soon Kwon|  Amitabh Bachchan  

Other Articles