iBall mSLR Cobalt4 With Bundled Detachable Lenses Launched at Rs. 8,499

Iball launches budget phone mslr cobalt4 with 4 detachable lenses

android, camera, iball, iball mslr cobalt4, iball mslr cobalt4 price, iball mslr cobalt4 price in india, iball mslr cobalt4 specifications, india, lenses, mobiles

iBall on Monday launched its mSLR Cobalt4 smartphone in India. The handset will be available across the region in the coming weeks for a best buy price of Rs. 8,499

ఐబాల్ నుంచి కోబాల్ట్.. కెమెరా కమ్ స్మార్ట్ ఫోన్.. 4 లెన్సులతో..

Posted: 06/16/2015 08:57 PM IST
Iball launches budget phone mslr cobalt4 with 4 detachable lenses

స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలి! అదే సమయంలో, లెన్స్‌లున్న కెమెరా కూడా కొనుక్కోవాలని అనుకుంటున్నారా! అయితే, మీరు ఇప్పుడు రెండూ కొనుక్కోవాల్సిన పని లేదు! రెండింటినీ కలిపి స్మార్ట్‌ఫోన్‌లోనే అందుబాటులోకి తెస్తోంది ఐబాల్‌! ఐబాల్‌ కోబాల్ట్‌ ఎంఎస్‌ఎల్‌ఆర్‌4 అనే ఫోన్‌ను ప్రత్యేకంగా ఫొటోగ్రఫీ ప్రియుల కోసమే రూపొందించింది. ఈ ఫోన్‌తోపాటు నాలుగు లెన్స్‌లు కూడా వస్తాయి. వాటిలో ఒకటి ఏకంగా 8ఎక్స్‌ జూమ్‌ అయితే.. మరొకటి 175-180 డిగ్రీ యాంగిల్‌లో చూసే ఫిష్‌ ఐ లెన్స్‌! మరొకటి 10 రెట్లు పెంచుకునే మాక్రో లెన్స్‌

అయితే, చివరిది 130 డిగ్రీ యాంగిల్‌లో చూసే 10-15 ఎంఎం మినిమమ్‌ ఆబ్జెక్ట్‌ డిస్టెన్స్‌ లెన్స్‌! స్మార్ట్‌ఫోన్‌కు వెనకాల కెమెరా స్లాట్‌ ఉంటుంది కదా! వీటిని కూడా దానికే బిగించుకోవచ్చు! ఆ తర్వాత ఎంచక్కా కావాల్సిన ఫొటోలు కూడా తీసుకోవచ్చు. అంతేనా.. 1 జీబీ రామ్‌.. 8 జీబీ రోమ్‌.. 5 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే స్ర్కీన్‌.. ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌కాట్‌లతో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లూ బాగానే ఉన్నాయి. ఇంతకీ దీని ధర ఎంతంటారా!? ప్రస్తుతానికి అయితే రూ.8499! దశలవారీగా కొద్ది వారాల్లోనే దేశవ్యాప్తంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుందట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : android  camera  iball  iball mslr cobalt4  

Other Articles