ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, భారత వాతావరణశాఖ ఐఎండీ విడుదల చేసిన వర్షాభావ పరిస్థితుల అంచనాలతో కుదేలయిన స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజు కూడా నష్టాలలో ముగిసాయి. నేషనల్ స్టాక్ ఎక్చేంచ్ నిఫ్టీ ఏకంగా ఏడు మాసాల కనిష్ట స్థాయికి చేరుకుంది. 8 వేల మార్కు చెంతకు దిగజారింది. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ల నష్టాల బాటలో పయనించాయి. అయితే స్వల్ప నష్టాలలో పయనించడంతో వరుసగా వారారంభంలో రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే స్వల్ప నష్టాలతో పయనించిన దేశీయ సూచీలు.. అదే క్రమంలో ముగిసాయి.
హెల్త్ కేర్ , టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో.. స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. కాగా బ్యాకింగ్, కన్జూమర్ గూడ్స్, లోహానికి సంబంధించిన సూచీల కోనుగోళ్లకు మదుపరులు ఆసక్తిని కనబర్చడంతో స్టాక్ మార్కెట్లు అధిక నష్టాల నుంచి గట్టెక్కాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 26 వేల 481 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 8022 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో వేదాంత, హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా పవర్, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, కాయిర్న్ ఇండియా, సిప్లా, బాస్చ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మసూటికల్స్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more