Nifty ends below 8700 ahead of fed meet outcome gold futures gain 0 15 per cent

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, gold, yellow metal, future trading

Nifty ends below 8700 ahead of Fed meet outcome; Gold futures gain 0.15 per cent

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఫ్యూచర్ ట్రేడింగ్లో పసిడి కాంతులు.

Posted: 03/18/2015 06:45 PM IST
Nifty ends below 8700 ahead of fed meet outcome gold futures gain 0 15 per cent

దేశీయ సూచీలలో నష్టాల భాటలో పయనించాయి. ఇవాళ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోగా, నిప్టీ కూడా 37 పాయింట్లు నష్టాలను చవిచూసింది. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతరేక పవనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలని నమోదు చేసుకున్నాయి. ఇవాళ పెడరల్ రిజర్వ్ తమ ఆర్థిక విధానలను ప్రకటించనున్న నేపథ్యంలో మదుపుదారులు అమ్మకాలకు మొగ్గచూపడంతో.. దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. ముఖ్యంగా వేగంగా వినియోగించే నిత్యావసర వస్తువులు ఎఫ్ ఎంజీసీ. ఇఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, అటో సెక్టార్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి.

ఈ నేపథ్యంలో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 28, 622 వద్ద ముగియగా,. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 37 పాయింట్లు కొల్పయి 8,686 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో జీ ఎంటర్ టెన్ మెంట్ , బీపీసీఎల్, ఎన్ ఎం డీ సీ, ఎస్ బి ఐ, రిలయన్స్ సంస్థలకు చెందిన షేర్లు లాభాలను ఆర్జించగా, ఎన్ టీ పీ సీ, బీహెచ్ఈఎల్, అంబుజా సిమెంట్స్, టెక్ మహీంద్రా, అసియన్ పెయింట్స్..సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

మరోవైపు ఫ్యూచర్ ట్రేడింగ్స్ లో పసిడి కాంతులీనింది. ఫ్యూచర్ ట్రేడింగ్ లో బంగారా కాంతులీనుతుందన్న భారీ అంచనాలకు బ్రేకులు పడ్డాయి. కుందనం ధర స్వల్పంగా మాత్రమే పెరగనుంది. ఫ్యూఛర్ ట్రేడింగ్ లో పది గ్రాముల బంగారం 0.15 శాతం పెరిగి 25 వేల 796 రూపాయలకు చేరుతుందని అంచనా. విదేశాల నుంచి వచ్చే సానుకూల పవనాల నేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతుందని అంచనా, ఏప్రిల్ లో 33 రూపాయల మేర పెరిగి 25 వేల 650 రూపాయల ధర పటకున్నపసిడి. జూన్ మాసంలో నలభై రూపాయల మేర పెరుగుతుందని అంచనా,

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  gold  

Other Articles