ఎనిమిది రోజులు వరస లాభాలకు బ్రేకులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెట్రోలియం శాఖలో అగంతకులు పలు కీలక పత్రాలను లీక్ చేసిన ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పెట్రోలియం శాఖ పత్రాలు లీక్ తో రిలయన్స్ సంస్థ షేర్లు మూడు శాతం నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల, నిఫ్టీ 62 పాయింట్లను నష్టపోయాయి. మరోవైపు ఈ నెల 28న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై మదుపరులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటంతో అన్ని రంగాల్లో అభివృద్ది వేగం పుంజుకుంటుందన్న అంచానాలతో మదుపరులు తమ తాహత్తుకు మించి పెట్టుబడులు పెట్టారని వ్యాపారులు పేర్కోంటున్నారు.
దీని వల్లే గత ఏడు రోజుల్లో మునుపెన్నడూ లేనంతగా మార్కెట్లు 1235 పాయింట్ల లాభాలను ఆర్జించాయని, వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు కొంత స్థబ్దుగా వుంటాయని వారు చెబుతున్నారు. దీంతో ఇవాళ 23 సంస్థలకు చెందిన షేర్లు నష్టాలను చవిచశాయని, వారు అంచనా వేస్తున్నారు. ఇవాళ 231 పాయింట్లను నష్టపోయిన సెన్సెక్స్ 29 వేల 231 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిష్టీ 62 పాయింట్లను కోల్పోయి 8 వేల 834 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక బిహెచ్ఇఎల్, ఐటీసీ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్, గెయిల్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, రిలయన్స్ టాటా పవర్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇన్పోసిస్, విప్రో, హెచ్ డీ ఎఫ్ సీ, మారుతి సుజుకీ సంస్థల షేర్లు అధికంగా నష్టాలను చవిచూశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more