24 xiaomi mi 4 phone yet to launch in indian markets on

Xiaomi Mi4, Xiaomi, smartphone, Indian markets, Xiaomi Mi mini router, Xiaomi USB LED torch, Xiaomi Mi Smart Socket 5V/1A with USB, Xiaomi Mi Key Quick button, Xiaomi Mi Wi-Fi, Xiaomi Wi-Fi remote car, Xiaomi Mini USB Wi-Fi, Xiaomi Mini stereo speakers, Xiaomi Mi 2S, Xiaomi Spy Camera Car, Xiaomi Mi Pad, Xiaomi Mi Air Purifier, head phones, note book, laptop, Televisions, Earphones

24 Xiaomi MI 4 phone yet to launch in indian markets on 28 of this month

భారతీయ విఫణిలోకి 28న షియోమి ఎంఐ4 స్మార్ట్ ఫోన్...

Posted: 01/21/2015 05:45 PM IST
24 xiaomi mi 4 phone yet to launch in indian markets on

చైనా యాపిల్గా ప్రసిద్ధి చెందిన షియోమి కంపెనీ తన తాజా 4జీ మొబైల్ ఫోన్, ఎంఐ4ను ఈ నెల 28న భారతీయ విఫణిలో ఆవిష్కరించనుంది. వేగంగా వృద్ధి సాధిస్తోన్న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరింత వాటా పెంచుకోవటం లక్ష్యంగా షియోమి కంపెనీ ఈ ఎంఐ4  మొబైల్ను తెస్తోంది. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఎంఐయూఐ ఓఎస్)పై పనిచేసే ఎంఐ4  మొబైల్ ఫోన్లో 5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 2.5 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సోనీ ఐఎంఎక్స్ 214 బీఎస్ఐ సెన్సర్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లున్నాయి.

గత ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించిన షియోమి ప్రస్తుతం రెడ్మి వన్ఎస్, రెడ్మి నోట్, ఎంఐ3 మొబైల్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. కాగా ఇటీవలనే బీజింగ్లో షియోమి కంపెనీ ఎంఐ నోట్, ఎంఐ నోట్ ప్రొ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. వీటితో పాటు మొత్తంగా ముఫై రకాల మొబైల్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన అసెసోరీస్ (ఉపకరణాలను) కూడా ఈ నెలలో అందుబాటులోకి తీసుకురానుంది. మరి వీటి అమ్మకాలను కూడా ఈ కామర్స్ ద్వారా చేపడుతుందా లేక రిటైల్ మార్కెట్ లోకి ప్రవేశపెడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi Mi4  Xiaomi  smartphone  Indian markets  

Other Articles