Pre budget cheer on dalal street sensex nifty hit record highs

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, RBI, RBi rate cut, Repo rate, Nifty, Stocks, Sensex today

Stocks continued their upward sprint for the fourth straight day Tuesday with the benchmark BSE Sensex scaled another peak of 28,829.29 and the NSE Nifty climbed to new high 8,707.90 in afternoon trade, led by a rally in metal, banking,

కొత్త మైలు రాళ్లను నమోదు చేసుకున్న దేశీయ సూచీలు

Posted: 01/20/2015 06:59 PM IST
Pre budget cheer on dalal street sensex nifty hit record highs

మరో నెల రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు గంపెడంత ఆశలు దేశీయ సూచీలను కొత్త మైలు రాయిలను తాకేలా చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. వరుసగా నాల్గవ రోజు స్టాక్ మార్కెట్టు భారీ లాభాలను నమోదు చేసకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 వేల 829 మార్కు వద్ద ముగియగా, నిఫ్టీ 8 వేల 7 వందల మార్కును తాకింది. అ తరువాత కొంత మేరకు లాభాలు తగ్గడంతో చివరకు 8 వేల 696 పాయింట్ల వద్ద ముగిసింది. గత డిసెంబర్ 4న 8627 పాయింట్లను తాకిన నిఫ్టీ ఏకంగా ఆ మార్కును దాటి కొత్త మైలురాయికి చేరువలో వుంది.

లోహం, బ్యాకింగ్, రియాలిటీ, ఎఫ్ ఎం జీ సీ, ఆయల్ అండ్ గ్యాస్ సూచీలు లాభాలను కొనసాగించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నాటి నుంచి మదుపరులు పెట్టబడులకు పూనుకోవడంతో మార్కట్లు లాభాల భాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్ల లాభంతో 28 వేల 786 పాయింట్ల ట్రేడింగ్ ను ముగించగా, నిఫ్టీ 8 వే 696 పాయింట్ల వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, సీసాగోవా, టాటా స్టీల్, యాక్సిక్ బ్యాంక్, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు సుమారు నాలుగు శాతం షేర్లను కైవసం చేసుకోగా, గెయిల్,  టాటా పవర్ కార్పోరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, మారుతి సుజుకీ, హీరో మోటార్ కార్పోరేషన్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles