Tata motors launches bolt hatchback

tata bolt review, tata bolt launch date, tata bolt team bhp, tata bolt specifications, tata motors, tata zest, tata motors, tata bolt, four wheelers, tata bolt, new launch, tata motors, auto news, tata bolt kmpl, tata bolt prices, tata bolt modes, tata bolt petrol version price, tatabolt diesel version price, Tata Bolt Price in India, tata bolt Mileage, tata bolt Colours, tata bolt Interiors, tata bolt Specifications, tata bolt Features, tata bolt complete information

Tata Motors on Thursday launched its new hatchback, the Bolt at a starting price of Rs 4.44 lakh for the petrol version & Rs 5.49 lakh for the diesel version (ex-showroom Delhi).

భారతీయ విఫణిలోకి మరో కొత్త కారు.. టాటా బోల్ట్

Posted: 01/22/2015 04:48 PM IST
Tata motors launches bolt hatchback

టాటా మోటార్స్ నుంచి మరో సరికోత్త కారు వచ్చేసింది. ఇవాళే భారతీయ విపణిలో అడుగుపెడుతున్న ఈ కారు కోసం అనేక మంది కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్' ఇవాళే మార్కెట్లో విడుదలైంది. ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరకే (పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.44 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్-షోరూమ్) టాటా మోటార్స్ తమ బోల్ట్ కారును ప్రవేశపెట్టింది. టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో (నాలుగు పెట్రోల్, నాలుగు డీజిల్) లభ్యం కానుంది. ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ను 35 ఏళ్ల లోపు వయస్సు కలిగిన యువతను లక్ష్యంగా చేసుకొని స్పోర్టీగా, స్టయిలిష్‌గా డిజైన్ చేశామని టాటా మోటార్స్ స్మాల్ కార్స్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ తెలిపారు

టాటా బోల్ట్ కారును విడుదలకు ముందే 50 నగరాల్లో ప్రదర్శనకు ఉంచామని, దీనికి అనూహ్యమైన స్పందన లభించిందని టాటా మోటార్స్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) ప్రెసిడెంట్ మయాంక్ పారీక్ తెలిపారు. బోల్ట్ టెస్ట్ డ్రైవ్ కోసం ఇప్పటివరకూ 10,000 లకు పైగా అభ్యర్థనలు వచ్చాయని, 50,000 లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయని ఆయన తెలిపారు. టాటా బోల్ట్ మైలేజ్ వివరాలు కంపెనీ యాజమాన్య తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్ వెర్షన్ - 17.57 కెఎంపిఎల్, డీజిల్ వెర్షన్ - 22.95 కెఎంపిఎల్.

పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో, టాటా మోటార్స్ అందిస్తున్న సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కానీ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కానీ అందుబాటులో లేదు. డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, టాటా జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ అందుబాటులో లేదు.

ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు గాను టాటా జెస్ట్, మరియు టాటా బోల్ట్ మోడళ్లను రెండింటినీ ఒకే (ఎక్స్1) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. అందుకే ఈ రెండు మోడళ్ల ఫ్రంట్ డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇంజన్ పరంగా కూడా మార్పులు వీటిలో మార్పులు లేవు. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోను ఉపయోగించారు.టాటా బోల్ట్ కారు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, బాష్ నుంచి గ్రహించిన 9వ తరం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), సిఎస్‌సి (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుత మరియు భవిష్యత్ సేఫ్టీ నిబంధనలకు లోబడి ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కేవలం టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌టి) టాటా బోల్ట్ కారులో మాత్రమే టచ్‌స్క్రీన్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్లలో స్టాండర్డ్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tata motors  tata bolt  four wheelers  tata bolt  new launch  tata motors  auto news  

Other Articles