Sensex gains 365 points

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, Crude oil prices, Greece, Euro region

The benchmark Sensex on Tuesday plummeted by 855 points in its worst crash in five and a half years as stock markets globally went into a tailspin amid speculation about probable exit of Greece from the Euro region and oil prices cracking below USD 50 per barrel mark.

క్రమంగా కోలుకుంటున్న మార్కెట్లు, 366 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

Posted: 01/08/2015 06:14 PM IST
Sensex gains 365 points

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఇంధన ధరల ప్రభావంతో ఒక్కసారిగా కుప్పకూలిన మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. నిన్న స్వల్ప లాభాలను అర్జించిన మార్కెట్లు ఇవాళ పుంజుకోవడంతో మార్కెట్లు ముగిసే సమయానికి 366 పాయింట్ల లాభాలను గడించాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కోనసాగించి  27 వేల 275 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 8 వేల 234 పాయింట్ల వద్ద ముగిసింది.

 టాటా మోటార్స్, ఐసిఐసి బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, హిండల్కో, గెయిల్ సంస్థల షేర్లు లాభాలను అధిక లాభాలను (సుమారు 2.20 శాతం) ఆర్జించాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మినహా అన్ని సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి. రిలయన్స్ సంస్థల షేర్లు 1.47 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అటు ఫోరెక్స్ మార్కట్లో రూపాయి కూడా లాభపడింది. రూపాయి సుమారు ఎనభై పైసలు పుంజకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 62 రూపాయల 65 పైసలకు చేరుకుంది. మరోవైపు బంగారం ధరల కాంతులు వెలవెల బోయాయి. బంగారం ఏకంగా 341 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర 26 వేల 820గా నమోదైంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles