Sensex rises 127 points to one week high nifty reclaims 8 300 mark

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Sensex rises 127 points to one-week high; Nifty reclaims 8,300-mark

వారం గరిష్టస్థాయికి సెన్సెక్స్.. 8300 మార్కును తాకిన నిఫ్టీ

Posted: 01/12/2015 08:35 PM IST
Sensex rises 127 points to one week high nifty reclaims 8 300 mark

ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రోడక్షన్ డేటా పాజిటివ్ వార్తలతో పాటు రిటైల్ రంగంలో ద్రవ్యోల్భణం నేపథ్యంలో ఇవాళ దేశీయ సూచీలు లాభాలను ఆర్జించి వారం క్రితం గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 27 వేల 585 పాయింట్ల వద్దకు చేరుకుంది. అటు నిఫ్టీ మరోమారు 8వేల మూడు వందల మార్కును తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి 39 పాయింట్ల లాభంతో 8 వేల 323 పాయింట్లకు చేరుకుంది. ఇక సెక్టార్ పరంగా చూస్తే మెటల్ సూచీలు 1.26 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.19 శాతం రియాల్టీ సూచీలు 0.03 శాతం నష్టపోయాయి. కాపిటల్ గూడ్స్ 1.55 శాతం, ఐటీ సెక్టార్ సూచీలు 1. 32 శాతం లాభపడ్డాయి.

ఈ క్రమంలో హిందుస్థాన్ యూనీ లీవర్, ఎల్ అండ్ టి, ఇన్పోసిస్, హెచ్.డి.ఎప్.సి, బిహెచ్ఇఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, టాటా పవర్, విప్రో, ఎన్టీపీసీ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, రిలయన్స్, గెయిల్, ఓఎన్జీసీ, సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles