Sensex suffers biggest one day loss in 5 5 years

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, Crude oil prices, Greece, Euro region

The benchmark Sensex on Tuesday plummeted by 855 points in its worst crash in five and a half years as stock markets globally went into a tailspin amid speculation about probable exit of Greece from the Euro region and oil prices cracking below USD 50 per barrel mark.

భారీనష్టాలకు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు...

Posted: 01/06/2015 07:30 PM IST
Sensex suffers biggest one day loss in 5 5 years

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత వారం లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కట్లు ఇవాళ రోజంతా తీవ్ర నష్టాల్లో కొనసాగి నష్టాల్లోనే ముగిశాయి. ఐదున్నరేళ్ల కనిష్టస్థాయికి మార్కెట్లు చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావడంతో దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి. మదుపర్లు తమ షేర్లను అమ్మకానికి అధికంగా మొగ్గు చూపడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముడి చమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోవడంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతుందేమోనన్న అనుమానాలు కూడా స్టాక్‌మార్కెట్ పతనానికి ఓ కారణంగా భావిస్తున్నారు. అమెరికా స్టాక్‌మార్కెట్లు నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా అదే తరహాలో నష్టాలు రావడంతో.. దేశీయ సూచీలు భారీగా క్షీణించాయి.

2009 ఏప్రిల్ తర్వాత ఇందన ధరలు ఇంత భారీ స్థాయిలో పతనమవడం ఇదే మొదటిసారి. దీని ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్‌పై పడటంతో అక్టోబరు 24, 2008 తర్వాత ఇంత పెద్దఎత్తున మార్కెట్లు కుప్పకూలడం ఇదే మొదటిసారి. దీంతో సెన్సెక్స్ 27 వేల దిగువకు పడిపోయింది. 855 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 26,987 వద్ద ముగియగా, నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోయి 8,127 వద్ద ముగిసింది. హిందుస్థాన్ యూనీ లీవర్ సంస్థ షేర్లు మాత్రమే టాప్ గెయినర్స్‌లో స్థానం పొందింది. జిందాల్ స్టీల్, ఓఎన్‌జీసీ, సెసా స్టెర్త్లెట్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ... తదితర షేర్లన్నీ భారీ నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles