Google online shopping festival 2013 begins today

Google Online Shopping Festival-2013,google, great online shopping festival, gsof, e-commerce, e-commerce, online travel sites, auto companies, telecom companies, fashion labels

Internet search giant Google today announced launch of the Great Online Shopping Festival (GSOF), a mega festival bringing leading e-commerce players in India on a common platform targeting about 20 million Indians who shop thorough the Internet

గూగుల్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్

Posted: 12/11/2013 04:50 PM IST
Google online shopping festival 2013 begins today

ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఆన్ లైన్ షాపింగ్ వినియోగ దారులకు ఈ కామర్స్ సైట్ల ద్వారా వివిధ రకాల వస్తువులను అతి తక్కువ ధరకు అందించేందుకు ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల ని ఈ రోజు ప్రారంభించింది.  ఈ ఫెస్టివల్ నేటి నుండి మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. గూగుల్ ఆధ్వర్యంలో జరిగే గ్రేట్ ఆన్‌లై న్ షాపింగ్ ఫెస్టివల్‌లో ఈ కామర్స్ సైట్లు మూడు రోజుల పాటు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నాయి.

ఉత్పత్తులను బట్టి గరిష్టంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. గత సంవత్సరం మొట్ట మొదటి సారిగా ప్రారంభం అయిన ఈ ఆన్ లైన్ ఫెస్టివల్ కి అనూహ్య స్పందన రావడంతో రెండోసారి దీన్ని విజయవంతంగా నిర్వహించడానికి సిద్దం అయింది. ఈ ఫెస్టివల్ ద్వారా మరింత మంది ఆన్ లైన్ షాపింగ్ వినియోగ దారులను ఆకట్టుకోవాలని ప్రయత్నిం చేస్తుంది.

ఈ గూగుల్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ లో ఫ్లాట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని టాటా గ్రూప్‌కు చెందిన టాటా హౌసింగ్ తెలిపింది. ఈ మేరకు గూగుల్‌తో తమ అనుబంధ సంస్థ టాటా వాల్యూ హోమ్స్(టీవీహెచ్‌ఎల్)ఒక ఒప్పందం కుదుర్చుకుందని టాటా హౌసింగ్ తెలిపింది.  పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లోని టీవీహెచ్‌ఎల్ ప్రాజెక్టుల్లోని గృహాలను రూ.20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని వివరించింది.

మీరు ఆన్ లైన్ షాపింగ్ వినియోగ దారులు అయితే వెంటనే త్వరపడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles