Warren buffett wealth soared 37 million a day

Warren Buffett, 37 million per day, Buffett's wealth soared 37 million,

Warren Buffett gained more wealth than any other U.S. billionaire, adding $37 million a day, according to one study.

ఇతని సంపాదన రోజుకు 4 కోట్లు

Posted: 12/19/2013 02:34 PM IST
Warren buffett wealth soared 37 million a day

అమెరికన్ వ్యాపార దిగ్గజం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫట్ సంపద ఈ ఏడాది కొండలా పెరిగిపోయింది. ఈ ఏడాదిలో ఆయన సంపద రోజుకు 37 మిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది. వెల్త్ - ఎక్స్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2013 లో బఫెట్ సంపద ఈ ఏడాది ప్రారంభంలో 46.4 బిలియన్ డాలర్లుగా ఉన్న అతని సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 59.1 బిలియన్ డాలర్లకు చేరింది.

బఫెట్ సంపద ఇంత పెరిగినా కానీ  మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ 72.6 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచాడు. వెల్త్-ఎక్స్ టాప్ 10 కుబేరుల సంపద జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాల్ని వెల్లడించింది. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం టాప్ 10 సంపన్నుల సంపద 2013లో 101.8 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.

డిసెంబర్ నాటికి వీరందరి ఆస్తి విలువ కలిపితే 347 బిలియన్ డాలర్లు. కెసినో దిగ్గజం షెల్డన్ అడెల్‌సన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్ బర్గ్ వరుసగా 3 నుంచి 5వ స్థానం దాకా ఆక్రమించారు. ఈ జాబితాలో భారతీయులు ఒక్కరు కూడా లేక పోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles