Sensex closes 388 points up

stock market,Sensex,Rupee,NTPC,NSE,nifty,market breadth,Iran dea,Iran,Indian market,ICICI bank,crude prices,BSE sensex,BSE,BPCL,BHEL

Snapping a three-day losing run, the benchmark Sensex today surged 388 points.

మూడు రోజుల నష్టాలకు బ్రేక్

Posted: 11/25/2013 07:38 PM IST
Sensex closes 388 points up

గత మూడు రోజుల నుండి డీలా పడుతూ వస్తున్న స్టాక్ మార్కెట్ కి నేడు రెక్కొలొచ్చాయి. మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ 388 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ దూసుకొని పోగా, నిఫ్టీ కూడా 119 పాయింట్ల లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పతనం, ఇరాన్ తో అగ్రరాజ్యాల ఒప్పంద అంశాలు నేటి స్టాక్ మార్కెట్ పై తీవ్రమైన సానుకూల ప్రభావం చూపడంతో ప్రధాన సూచీలన్నీ లాభ పడ్డాయి.

సెన్సెక్స్ పెరుగుదలకు కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియాల్టీ, కంపెనీల షేర్లు దోహద పడ్డాయి. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 6115 వద్ద క్లోజైంది. ఐసీఐసీఐ బ్యాంక్, భెల్ అత్యధికంగా 5 శాతం లాభపడగా, బీపీసీఎల్, కొటాక్ మహేంద్ర, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు 4 శాతానికి పైగా లాభపడ్డాయి.

ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిండాల్కో, లుపిన్ లు స్వల్పంగా నష్టపోయాయి. ఆరంభంలోనే 31 పైసలు పడిన రూపాయి వివాదస్పద న్యూక్లియర్ కార్యక్రమంపై ఇరాన్, అగ్రరాజ్యాల మధ్య ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ కు వ్యతిరేకంగా యూరో బలపడటం రూపాయి బలపడటానికి కారణం అయ్యాయి. ప్రస్తుతం 37 పైసల లాభంతో 62.50 వద్ద ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles