Ap it sector turnover crosses rs 50000 cr mark

IT sector, IT industry turnover, direct employment

IT Industry in AP has crossed the magic mark of Rs 50000 crore in terms of turnover for the very first time..

AP IT sector turnover crosses Rs 50000-cr mark.png

Posted: 12/27/2012 07:48 PM IST
Ap it sector turnover crosses rs 50000 cr mark

AP_IT_sector

రాష్ట్ర ఐటీ పరిశ్రమ మొట్టమొదటిసారిగా ఈ ఏడాది రూ. 50,000 కోట్ల టర్నోవరు మార్కు దాటిందని, రూ. 53,246 కోట్లకు చేరిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ సంస్థల సమాఖ్య ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు. ఇందులో ఎగుమతుల వాటా 76 శాతం (రూ. 40,646 కోట్లు) కాగా, దేశీయ మార్కెట్ వాటా 24 శాతం (రూ. 12,600 కోట్లు) అని ఆయన వివరించారు. ఉపాధి పరంగా కూడా రాష్ట్ర ఐటీ పరిశ్రమ మరో మైలురాయి అధిగమించినట్లు రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష ఉపాధికి సంబంధించి తొలిసారి 3,00,000 ఉద్యోగాల మార్కు దాటిందని వివరించారు.ప్రస్తుతం మొత్తం 13.3 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా ..ఇందులో 3,18,624 మంది ప్రత్యక్షంగాను, 10,12,769 మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని రాజన్న పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 38 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఐటీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రానిది దేశంలో నాలుగో స్థానమని పేర్కొన్నారు. జాతీయ సగటుకు సమానంగా రాష్ట్ర ఐటీ 16 శాతం వృద్ధి రేటు సాధిస్తోందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ratan tata to retire today
53 lakh jobs were generated during 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles