Ratan tata to retire today

atan Tata to retire today, Cyrus Mistry to succeed him,Ratan Tata,Cyrus Mistry,Tata Sons,Shapoorji Pallonji Group,Tata Consultancy Services

Ratan Tata, who led the transformation of the Tata group from a conventional corporate house into a $100 billion global conglomerate with high-profile.

Ratan Tata to retire today.png

Posted: 12/28/2012 06:49 PM IST
Ratan tata to retire today

Ratan_tata

నేటితో ఒక శకం ముగుస్తోంది. వ్యాపారమంటే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ప్రలోభాలు కాదని నిబద్ధత, అంకిత భావం వంటి విలువలతో కూడా వ్యాపారం చేయవచ్చని నిరూపించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా నేడు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో పల్లోంజి మిస్త్రీ పగ్గాలు చేపడతారు. 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఆయనే ఏర్పర్చిన నిబంధనకు అనుగుణంగా ఆయన టాటా గ్రూప్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ నుంచి నిష్ర్కమించనున్నారు. అయితే ఆయన టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు. 21 ఏళ్లలో టాటా గ్రూప్ సంపదను 13 రెట్లు పెంచి సైరస్ మిస్త్రీకి 10,000 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.5,50,000 కోట్లు)వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా వదిలివెళుతున్నారు.

1962లో టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా రతన్ టాటా ప్రస్థానం ప్రారంభమైంది. జేఆర్‌డీ టాటా వారసుడిగా 1991లో టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టారు. 21 ఏళ్లలో టాటా గ్రూప్ వ్యాపారాన్ని దేశీయంగా లాభాల బాట పట్టించడమే కాకుండా, విదేశాలకు సైతం విస్తరించారు. విదేశాల్లో కంపెనీలను కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం, ప్రతిష్టకు పోకుండా లాభదాయకం కాని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటి చర్యల ద్వారా ఇంట గెలిచి రచ్చ గెలిచారు. విలువలతో కూడిన సమర్థవంతమైన వ్యాపారవేత్త అన్న ప్రశంసలెన్నో అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New year may bring in up to 10 lakh jobs
Ap it sector turnover crosses rs 50000 cr mark  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles