ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద షిప్‌యార్డు నిర్మాణానికి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది దేశంలోనే 14వ అతిపెద్ద షిప్‌యార్డు అవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద షిప్‌యార్డు కానున్నది. భూసేకరణ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. గతంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఐదో నంబరు జాతీయ రహదారికి 15 కి.మీ. దూరంలో ఉన్న తీరంలోని రామాయపట్నంలో షిప్‌యార్డుకు ప్రతిపాదనలు చేశారు.
రామాయపట్నం వద్ద నిర్మించబోయే షిప్‌యార్డులో ప్రధానంగా నౌకల నిర్మాణం, మరమ్మతుల యూనిట్లతో పాటు ఫిషింగ్ హార్బర్ ఉంటాయి. ప్రభుత్వరంగంలో ఇలాంటి షిప్‌యార్డులు కొచ్చిన్, ముంబై వంటి నగరాల్లోనే ఉన్నాయి. ఓడల నిర్మాణం, మరమ్మతుల యూనిట్ల ద్వారా సుమారు పదివేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. తీరం నుంచి రైల్వే ట్రాక్‌వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు యార్డు విస్తరిస్తుంది. షిప్‌యార్డు నిర్మాణానికి రూ. 10 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా. ఇందులో రూ. మూడువేల కోట్లు పునరావాసానికి ఖర్చుచేస్తారు. మిగిలిన నిధులను నౌకానిర్మాణ కేంద్రానికి కేటాయిస్తారు.షిప్‌యార్డులో మొత్తం ఆరు బెర్త్‌లు ఏర్పాటు చేయనున్నారు.షిప్‌యార్డుకు సుమారు ఐదువేల ఎకరాలు అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.
గతంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలిపారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, గ్రామాలు ఉన్నా అన్నింటినీ కలిపి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీరప్రాంతం కావడం వల్ల ఎక్కువ భూమి ప్రభుత్వానికి సంబంధించినదే ఉంది. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి.జిల్లా నుంచి గ్రానైట్ రాయిని ప్రధానంగా ఎగుమతి చేసేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. బియ్యం, మామిడి, సపోటాలు, పలకలు, ఐరన్ ఓర్‌ను కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. తీరప్రాంతం కావడం వల్ల ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రాసెస్ చేసిన సముద్ర ఉత్పత్తులను ఇప్పటివరకు చెన్నైకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి రేవు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. రామాయపట్నంలో రేవు నిర్మాణంతో రవాణా భారం తగ్గుతుంది. రసాయన ఎరువులు, కందిపప్పు, క్రూడాయిల్ వంటి సరుకుల దిగుమతి రామాయపట్నంలోనే జరుగుతుంది. ఇప్పటివరకు ఇవి కాకినాడ పోర్టుకు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more