Diageo does 21 billion deal for mallya

Vittal Mallya,United Spirits,Shaw Wallace,Ranbaxy,Nestle,kingfisher,KFA,Herbertsons,Berger Paints

Diageo does has agreed to buy a majority stake in United Spirits Ltd, controlled by Vijay Mallya, for $2.1 billion, fuelling a push by the world's biggest spirits

Diageo does $2.1 billion deal for Mallya.png

Posted: 11/10/2012 02:58 PM IST
Diageo does 21 billion deal for mallya

Diageo-doesఅప్పులు, నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎట్టకేలకు కొంత ఊరట లభించనుంది. కొద్దికాలంగా ఊహాగానాలతో ఊదరగొడుతున్న యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా విక్రయం ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిక్కర్ తయారీ సంస్థగా పేరొందిన బ్రిటిష్ దిగ్గజం డియాజియో పీఎల్‌సీ... యునెటైడ్ స్పిరిట్స్‌లో 53.4% మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.11,166 కోట్లు. ఈ వాటా విక్రయంతో లెసైన్స్ సస్పెన్షన్‌కు గురై మూలనకూర్చున కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కష్టాలు గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.

యునెటైడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్‌ఎల్)లో రూ.1,440 షేరు ధర చొప్పున 19.3 శాతం వాటాను దక్కించుకోవడం కోసం యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) లిమిటెడ్, యూఎస్‌ఎల్‌లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంయుక్త ప్రకటనలో డియాజియో పేర్కొంది. ఇందుకోసం రూ.5,725 కోట్లను చెల్లించనుంది. యూబీహెచ్‌ఎల్ గ్రూప్, యూఎస్‌ఎల్ బెనిఫిట్ ట్రస్ట్; పాల్మర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, యూబీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్(ఈ రెండూ యూఎస్‌ఎల్ అనుబంధ సంస్థలు); ఎస్‌డబ్ల్యూఈడబ్ల్యూ బెనిఫిట్ కంపెనీల నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనుంది. డియాజియోకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు కూడా యూఎస్‌ఎల్ తమ వాటాదార్ల నుంచి అనుమతి కోరనుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం పెరిగిన యూఎస్‌ఎల్ ఈక్విటీ క్యాపిటల్‌లో 10% కొత్త షేర్లు రూ.1,440 చొప్పున డియాజియోకు లభించనున్నాయి.తదనంతరం ఒక్కో షేరుకి రూ.1,440 ధరకు 26 శాతం వాటాను కొనుగోలు చేయడం కోసం డియాజియో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది.

పైన పేర్కొన్న విధంగా వాటాల కొనుగోలు పూర్తి కావడంతో పాటు ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయిన పక్షంలో యూఎస్‌ఎల్‌లో ప్రిఫరెన్షియల్ ఇష్యూ తర్వాత ఉండే మొత్తం షేర్ క్యాపిటల్‌లో డియాజియోకు 53.4% వాటా లభిస్తుంది. ఈ మొత్తం కొనుగోలు ధర రూ.11,166.5 కోట్లుగా నిలుస్తుంది. 2011 ఏడాదికి డియాజియో 13.3 బిలియన్ పౌండ్ల ఆదాయంపై 2.01 బిలియన్ పౌండ్ల లాభాన్ని ఆర్జిం చింది. యూఎస్‌ఎల్ 2011-12లో రూ.7,660 కోట్ల ఆదాయం, రూ.343 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India to grow fastest till 2060
Stock markets brush off obama win  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles