Stock markets brush off obama win

Stock markets Obama, Barack Obama, markets news

tock markets brush off Obama win The re-election of President Barack Obama gave markets a short-lived boost Wednesday.

Stock markets brush off Obama win.png

Posted: 11/08/2012 05:23 PM IST
Stock markets brush off obama win

tock_markets_brush_offమరోసారి అధ్యక్ష కిరీటాన్ని అందుకున్న బరాక్ ఒబామాను యూఎస్ స్టాక్ మార్కెట్లు 3% పతనంతో స్వాగతించాయి. రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీపై స్పష్టమైన ఆధిక్యంతో ఒబామా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యలో ఇటు యూరప్, అటు అమెరికా ఇండెక్స్‌లు నష్టాలకు లోనయ్యాయి. ఎన్నికలు పూర్తికావడంతో ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి పన్నుల పెంపుపైకి మరలినట్లు అక్కడి మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు 2013 నుంచి వ్యయాలలో కోతల వంటి చర్యలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. డోజోన్స్ 337 పాయింట్లు (2.5%) పతనమై 12,908 వద్ద, ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్ 32 పాయింట్లు (2.3% క్షీణించి) 1,396 వద్ద ట్రేడవుతుండగా... నాస్‌డాక్ 79 పాయింట్లు (2.6%) దిగజారి 2,932 వద్ద కదులుతోంది.

తాజా అమ్మకాల కారణంగా ఇండెక్స్‌లు ఆగస్ట్ స్థాయిలను తాకే అవకాశమున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రధానంగా టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ దిగ్గజాలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా 4.7%, జేపీ మోర్గాన్ చేజ్ 3.2%, ఏటీఅండ్‌టీ 3%, అల్కోవా 2%, యునెటైడ్ టెక్నాలజీస్ 2%, యాపిల్ 2.2% చొప్పున నష్టపోయాయి. మరోవైపు యూరో రుణ సంక్షోభం ప్రభావం జర్మనీను సైతం దెబ్బకొట్టడం మొదలైందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మారియో డ్రాఘీ వ్యాఖ్యానించడం యూరప్ మార్కెట్లను పడదోసింది. దీంతో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితరాలు 2% స్థాయిలో తిరోగమించి ట్రేడవుతున్నాయి. కాగా, ముడిచమురు కూడా బ్యారెల్‌కు 4 డాలర్లు (4%) పతనమై 85 డాలర్ల వద్ద కదులుతోంది. ఏమైనా ఒబామా గెలుపు స్టాక్ మార్కెట్లకు శాపంగా మారాయి అంటున్నారు నిపుణులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Diageo does 21 billion deal for mallya
India pharma industry may be among top 10 by 2020  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles