Deadlock over fdi ends after all party meet

Deadlock over FDI ends after all-party meet, government, after meeting, opposition parties, FDI in retail till a consensus is achieved among all parties

Deadlock over FDI ends after all-party meet

over FDI.gif

Posted: 12/07/2011 02:07 PM IST
Deadlock over fdi ends after all party meet

Deadlock over FDI ends after all-party meet   

చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే అంశా న్ని ప్రస్తుతానికి నిలిపివేసామని, ప్రతిపక్షాలను సంప్రదించిన తర్వాతనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌  ముఖర్జీ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్‌, సీతారామ్‌ ఏచూరిలకు తెలియచేసారు. బిజెపి నాయకురులు సుష్మాస్వరాజ్‌తోనూ, సిపిఎమ్‌ నాయకుడు సీతారాంఏచూరితోనూ ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడిన తర్వాత విషయం గురించి రకరకాల వార్త లు ప్రచారంలోకి వచ్చాయి.

అనేక రోజులుగా పార్లమెంటును స్తంభింప చేసిన నిర్ణయంపై ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయాలని సుష్మా స్వరాజ్‌ పట్టుబడినట్లు చెబుతున్నారు. బుధ వారం నాడు పార్లమెంటు మళ్ళీ సమావేశం అయ్యేలోగా అంశంపై అఖిల పక్ష సమావే శాన్ని ఏర్పాటు చేయాలని సీతారామ్‌ ఏచూరి ప్రధానిని కోరినట్లు తెలుస్తున్నది. సమావేశం లో ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలని, తర్వాత దానిపై పార్లమెంటులో ప్రకటన చేయా  లని ఆయన డిమాండు చేసారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాక ముందుగానే అఖి లపక్ష నాయకులు సమావేశం ఏర్పాటు చేయ  వచ్చునని  ఏచూరి సూచించా రు. గత వారం ముఖర్జీ ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తిరగతోడాలని పట్టుబడట్టడంతో దానిపై మళ్ళీ వారితో మాట్లా  డతానని ముఖర్జీ వాగ్దానం చేసారు. దీనిపై ముఖర్జీ ప్రధానితోనూ కేంద్ర మంత్రివర్గంతోనూ చర్చలు జరుపుతారని ఊహాగానాలు వచ్చాయి.

చిల్లర వ్యాపారంలో 51 శాతం ఎఫ్‌డిఐని అను మతించడానికి ప్రస్తు తానికి స్తంభింప చేస్తూ చేసిననిర్ణయాన్ని అఖిలపక్ష నాయకులకు చెప్పా లని ఏచూరి ముఖర్జీకి సూచించినట్లు తెలు స్తున్నది. ప్రతి పక్షాలు పార్లమెంటులో అంశంపై చర్చించడంతో పాటు ధరల పెరుగు  దల,బ్లాక్‌మనీ అంశాలను చర్చించాలని పట్టు బడుతున్నాయి.చర్చతర్వాతఓటింగ్‌ జరగవచ్చు.


ఎఫ్‌డిఐ ప్రతిపాదనల్లో మార్పు

  చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే అంశంపై పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు ప్రోత్సాహకశాఖ విడుదల చేసిన చర్చాపత్రంలో కొన్ని అంశాలను మంత్రివర్గ నిర్ణయ సమయంలో తొలగించారు. చర్చా పత్రంలో వాల్‌మార్ట్‌ కెర్రీఫోర్‌విదేశీ కంపెనీలు దేశీయ కిరాణా వర్తకులను తమ సప్ల§్‌ఛెయి న్‌లో భాగస్వాములు చేసుకోవాలని ప్రస్తావించా రు. పెద్ద పెద్ద రిటైల్‌ కంపెనీలు తమ అమ్మ కాల్లో కొంత భాగాన్ని కిరాణా దుకాణాదారు లకు అమ్మాలని ప్రతిపాదించారు. అందుకోసం టోకుగా సరుకుల విక్రయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఎంతశాతం ఇలా విక్రయించాలన్న అంశాన్ని పేర్కొనలేదు. వాల్‌మార్ట్‌కెర్రీఫోర్‌ అందుకు సిద్ధంగాఉన్నా తుది ప్రతిపాదనల్లో తొలగించారు. ప్రతి  పాదన ఉంటే ప్రతిపక్షాలు ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని ఇంత వ్యతిరేకించి ఉండేవి కావన్న అభిప్రాయం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reliance industries
The richest people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles