Reliance industries

Reliance Industries,,Reliance Group,Reliance Petroleum Limited (RPL),Reliance Industries Limited (RIL), Petroleum Refining and retailing,eliance Petroleum Refining and Marketing, Growth through Energy Products,Reliance Refinery Processes, Reliance petroleum business opportunities.

Reliance Industries

Reliance Industries.GIF

Posted: 12/12/2011 04:58 PM IST
Reliance industries

కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యం కంటే 30 శాతానికి పైగా పడిపోయిన నేపథ్యంలో... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఐ) సలహాల మేరకు చట్టపరంగా న్యాయాన్యాయాలను పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు చమురు శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. భౌగోళికపరమైన సమస్యలవల్లే ఉత్పత్తి తగ్గిందన్న రిలయన్స్ వాదన సరైనదే కావచ్చని అయితే, 50 శాతం మంది పరిశీలకులు మాత్రం ఈ కారణాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంచేయడం లేదనేది ఆయా వర్గాల సమాచారం. 2006లో ఆర్‌ఐఎల్ సమర్పించిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ) ప్రకారం కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్-1, 3 గ్యాస్ క్షేత్రాల్లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి 22 బావులను తవ్వాల్సి ఉంది.
కానీ, రిలయన్స్ మాత్రం ఇప్పటిదాకా 20 బావులనే తవ్వింది. ఇందులో రెండు బావుల్లో ఉత్పత్తి ప్రారంభించలేదు కూడా. గతేడాది మార్చిలో కేజీ-డీ6 గ్యాస్ ఉత్పత్తి రోజుకు 61.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు(ఎంఎంఎస్‌సీఎండీ) ఉండగా, ప్రస్తుతం ఉత్పత్తి 40.6 ఎంఎంఎస్‌సీఎండీలకు పడిపోయింది. ఉత్పత్తి క్షీణతకు సంబంధించి చమురుశాఖ చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దీన్ని సవాలు చేస్తూ ఆర్‌ఐఎల్ ఆర్బిట్రేషన్ నోటీసులను పంపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోపక్క, రిలయన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కంపెనీతో కుదుర్చుకున్న పీఎస్‌సీలో మార్పులేమీ ఉండవని చమురు శాఖ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి తాజాగా పేర్కొనడం విశేషం. ఉత్పత్తి క్షీణతపై మాత్రం దృష్టి పెడుతున్నామన్నారు. ఆర్‌ఐఎల్ ఆర్బిట్రేషన్‌ను పరిశీలిస్తున్నామని, దీనిపై నిపుణుల సూచనలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bank of america
Deadlock over fdi ends after all party meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles