The richest people

The Richest People, 2011 year, 47, 000 cores, 4,102 members, Central minister, RBI , 10 cores, Market, World, minister pranab mukarzi,

The Richest People

The Richest People.GIF

Posted: 11/30/2011 04:31 PM IST
The richest people

The Richest People

2011 మార్చితో ముగిసిన సమయానికి దేశంలో కోటీ రూపాయాలు పైగా రుణంగా తీసుకున్నవారు మొత్తంగా రూ.47,000 కోట్లు ఎగ్గొట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల్లో వేల రూపాయల్లో రుణాలు తీసుకుని చెల్లించకుంటే, వారి ఆస్తులను ఆయా బ్యాంకులు జప్తు చేస్తాయి. కాని కోట్ల రూపాయల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారిని డిఫాల్టర్లుగా గుర్తించి ఈ ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంట్‌లో డిఫాల్టర్లపై చేసిన ప్రకటనే. కోటి రూపాయలు పైగా రుణంగా తీసుకున్న 4,102 మంది రూ.47,594.31 కోట్లు పలువురు ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌కు వెల్లడించారు.;

ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం రూ.10 కోట్లు పైగా రుణంగా తీసుకుని చెల్లించని వారిలో 723 మంది డిఫాల్టర్లు ఉన్నారని, వీరు మొత్తంగా రూ. 26,165.51 కోట్లు వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టారని ప్రణబ్‌ లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ఆర్థిక రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇదే సమయంలో పారిశ్రామిక గృహాల రుణాల నిమిత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.14,12,542.71 కోట్లను మంజూరు చేశాయని కేంద్ర సహాయ మంత్రి నమో నారాయిన్‌ మీనా తెలిపారు. ప్రయివేటు రంగం బ్యాంకులు రూ.1,723.24 కోట్లు ఇచ్చాయని చెప్పారు.


అనిశ్చితి వల్లే రూపాయి పతనం


ప్రపంచవ్యాప్తంగా అలముకున్న ఆర్థిక అనిశ్చితి కారణంగానే రూపాయి విలువ పతనం చెందిందని ప్రభుత్వం సమర్థించుకుంది. సరఫరా-డిమాండ్‌ అసమతుల్యత కొంత కారణమని వ్యాఖ్యానించింది. యూరోజోన్‌ రుణ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు.

రాజ్యసభలో ఆయన ఈ మేరకు లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. విదేశీద్రవ్య మార్కెట్‌లో నెలకొన్న సరఫరా-డిమాండ్‌ల అసమతుల్యత కూడా దేశీయంగా రూపాయి మారకపు విలువ హెచ్చుతగ్గులకు కారణమని ఆయన వివరించారు. 2011లో ఇప్పటి వరకూ రూపాయి విలువల 14.8 శాతం పతనమైందని ప్రణబ్‌ తెలిపారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ భారతీయ రిజర్వు బ్యాంకు సునిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deadlock over fdi ends after all party meet
Indian share market  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles