The Biography of Chandala Kesavadasu | First telugu Industry actor | Indian Actors

Chandala kesavadasu biography first telugu industry actor

Chandala Kesavadasu biography, Chandala Kesavadasu history, Chandala Kesavadasu news, Chandala Kesavadasu updates, Chandala Kesavadasu gallery, Chandala Kesavadasu photos, indian actors, indian old actors, telugu film industry, tollywood

Chandala Kesavadasu biography First telugu Industry actor : The Biography of Chandala Kesavadasu who is the first lyricist in the history of the Telugu Film Industry.

తొలి తెలుగు సినీరంగ కళాప్రపూర్ణుడు కేశవదాసు

Posted: 06/20/2015 04:32 PM IST
Chandala kesavadasu biography first telugu industry actor

చందాల కేశవదాసు.. తొలి తెలుగు తొలి తెలుగు సినీరంగంలోని అన్ని విభాగాల్లో తన ప్రతిభను నాటుకున్నాడు. ఈయన ఒక గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, నాటకకర్త. ఇలా అన్ని విభాగాల్లో తన నైపుణ్యాన్ని చాటిచెప్పడం వల్ల ఈయనను కళాప్రపూర్ణుడిగా వర్ణిస్తారు. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’ అనే పాటలను ఈయన రాశారు. తెలుగులో మొదటి శబ్ద చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాసింది ఈయనే!

జీవిత చరిత్ర :

1876 జూన్ 20వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిలో నివాసముండే చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు కేశవదాసు జన్మించారు. వీరి అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధి బడిలోనే ఈయన విద్యనభ్యసించారు. ఛందస్సు, అవనాధి ప్రక్రియలు నేర్చుకున్నారు. విద్యను అభ్యసించిన అనంతరం ఈయన తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించారు.

కళారంగంలో ప్రవేశం :

కేశవదాసు అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న సమయంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. అప్పుడు ఆయన కేశవదాసుకు సంగీతంలోని మెలకువలు తెలియజేశారు. దాంతో ఆయన గేయరచనలో, సంగీతం కూర్పులో ఆరితేరారు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచారు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థులు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చారు. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు.

కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పారు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి. 1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచారు.

హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మర లో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారు. ఈయనకు ‘ఆంధ్రసూత’, ‘కలియుగ దశరథ’, ‘నటనా వతంస’ వంటి బిరుదులు లభించాయి. సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈయన.. 1956, జూన్ 14న పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandala Kesavadasu  telugu film industry  tollywood  

Other Articles