History of nithyannadanam at Omkara Kshetram క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

Bagavan, Kasireddy Nayana Swamy, Samartha Sadhguru Sri Kasinayana, Sadhguru Sri Kasireddy nayana, Sri Kasireddy nayana biography, about Sri Kasireddy nayana, Sri Kasireddy nayana annadanam, Sri Kasireddy nayana temples, Sri Kasireddy nayana omkaram, Sri Kasireddy nayana jyothi, Sri Kasireddy nayana bandi athmakur, Sri Kasireddy nayana nandyal, Sri Kasireddy nayana history, andhra pradesh

Samartha Sadhguru Sri Kasinayana is a great Sadhguru of modern India. He was born in Bedusupally Village, Seetharamapuram mandal, Nellore District, Andhra Pradesh. Apart from preachings he told his disciples to give food or atleast starch to the needy.

క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

Posted: 01/19/2019 01:37 PM IST
Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు ఆయన, ఆయన శిష్యబృందం ఆయన చెప్పిన మాటలను నేటికీ వందకుపైగా ఆశ్రమాలలో అనునిత్యం ఆచరిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఆయన నిత్యాన్నసమారాధన కార్యక్రమాలను చేపట్టారు. అనేక చోట్ల అశ్రమాలను స్థాపించి వాటిలో కుల, మత, ప్రాంతం, లింగభేధాలు లేకుండా వచ్చినవారికల్లా కడుపునిండా అన్నప్రసాదాన్ని పెట్టారు.

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని.. అన్నం పరబ్రహ్మా స్వరూపమని.. అన్నదానంలో మాత్రమే ఇక చాలు అన్న తృప్తిని దానం పోందే వ్యక్తి నుంచి వస్తుందని ఇప్పటికే ఎందరో గొప్పవారు విశ్లేషించారు. అయితే అన్నం కావాలని అడిగిన వారి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం... ఇదే నిజమైన మాధవ సేవ!’’ అని బోధించిన అవధూత కాశిరెడ్డి నాయన. కష్టాలు తీర్చే పెన్నిధిగా ఎందరికో ఆరాధ్యుడై, కొంగుబంగారంగా నిలిచే ఆధ్యాత్మిక గురువు.

జీవిత విశేషాలు:

ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడం కోసం జీవితాంతం పాటుపడిన మహనీయునిగా ప్రసిద్ధి చెందిన కాశిరెడ్డి నాయన అసలు పేరు మున్నళ్లి కాశిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఒకవైపు ఆటపాటలూ, మరోవైపు ఆధ్యాత్మిక చింతనతో ఆయన బాల్యం గడిచింది. పదహారేళ్ళ వయసులో చదువు చాలించి, వ్యవసాయ పనులు చేపట్టారు.

Kasi Reddy Nayana Photos(Image Source: Myindia-heritage.blogspot.com)

గరుబోధ:

ఒకసారి వేపచెట్టు కింద కాశిరెడ్డి కూర్చొని ఉండగా, ఆయనకు అంతర్వాణి దిశా నిర్దేశం జరిగింది. సొంత ఊరు నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అతిరాచ గురవయ్య స్వామిలో ఆయనకు సద్గురు సాక్షాత్కారం అయింది. గురవయ్య స్వామి శిష్యరికంలో మంత్రోపదేశం పొందారు. తన గమ్యమేమిటో అవగతం అయింది.

గురువు సూచన మేరకు తీర్థయాత్రలు ప్రారంభించారు. కన్యాకుమారి మొదలు కాశీ వరకూ దేశంలో కాశిరెడ్డి దర్శించని క్షేత్రం లేదు. కాశీలో మూడేళ్ళు గడిపారు. గరుడాద్రి వద్ద పన్నెండేళ్ళు తపస్సు చేశారు. తరువాత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్న దానం, గోసేవ, ఆలయాల జీర్ణోద్ధరణలపై విస్తృతంగా ప్రచారం చేశారు.
 
అన్నాన్ని పంచుకోవాలి!

కరువుకటకాలతో అలమటించే రాయలసీమ ప్రాంతంలో అకలిభాదను తీర్చే సద్గురువుగా మారాడు. తన భక్తబృందానికి అనేక ప్రవచనాలు చేసిన ఆయన అన్నాన్ని కూడా నలుగురితో పంచుకోండి అంటూ ప్రతినిత్యం సూచించేవారు. ‘‘అమ్మా.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టండి. శక్తి లేకపోతే గంజి పోయండి. పది మంది అన్నం ఒక్కరు తినకూడదు. నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి!’’ అని కాశినాయన బోధించేవారు.

నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఎందరినో ఆదుకున్నారు. తన ఆశ్రమాలలో ఆశ్రయం కల్పించారు. ఆకలి తీర్చారు. కష్టాలలో తోడూనీడగా నిలిచారు. భక్తులు ఆయనను తండ్రిగా భావించేవారు. కాశిరెడ్డి నాయన అని ఆప్యాయంగా పిలుచుకొనేవారు. గురోపదేశం ప్రకారం ఆయన దూపదీప నైవేధ్యాలకు కూడా నోచుకోని ఎన్నో ఆలయాలను కాశిరెడ్డి నాయన పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలోని క్రీ.శ 1406 నాటి ఘటిక సిద్ధేశ్వరాలయం 1974లో ఆయన చేతుల మీదుగా పూర్వవైభవం సంతరించుకుంది.

కాశీనాయన శివైక్యం

చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతిలో మసుకు ప్రశాంతతను ప్రసాదించే పరిసరాలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం అది. సొంత ఊరు నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి వస్తున్న క్రమంలో ఓ వేప చెట్టు కింద కూర్చున్న ఆయనకు అధ్యాత్మిక ప్రబోధం జరిగింది. గిద్దలూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని వున్న ఈ ప్రాంతంలో ఆయన సమాధి అయ్యారు. ఈ ప్రాంతాన్ని కాశీనాయన జ్యోతి అని భక్తులు పిలుస్తారు. ఇక్కడ కూడా ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. కాశి నాయన 1995 డిసెంబర్‌ 6న పరమపదించారు.

Kasi Reddy Nayana Photos(Image Source: Myindia-heritage.blogspot.com)

వందకుపైగా ఆశ్రమాలు

కాశిరెడ్డి నాయన సమాధి ఉన్న కడప జిల్లా నరసాపురం మండలంలోని జ్యోతి క్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఇది కడప జిల్లా ఆళ్ళగడ్డకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిరంతర అన్నదాన యజ్ఞం కొనసాగుతూ ఉంటుంది. ఏ సమయంలో వెళ్ళినా ఆదరించి, అన్నం పెట్టడం దీని విశిష్టత. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు.
 
నరసాపురం మండలం పేరును ‘కాశినాయన మండలం’గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చింది. కాశినాయన పేరిట రాయలసీమ ప్రాంతంలో వందకు పైగా ఆశ్రమాలు నడుస్తున్నాయి. అన్నదానంతో పాటు గోసంరక్షణకు కూడా ఇవి పాటుపడుతున్నాయి. వీటిలో తిరునాళ్ళతిప్ప ఆశ్రమం ఒకటి. ఇది అనేక ఆలయాల సముదాయంతో, పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. అలాగే, మహారాష్ట్రలోని షిరిడి నుంచి నాగర్ సోల్‌ వచ్చే దారిలో, కర్నూలు, కడప, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎన్నో దేవాలయాలు, ఆశ్రమాలు అన్నార్తులను ఆదుకుంటున్నాయి. వాటిలో ఒక్కటి బండిఆత్మకూరులోని ఓంకారక్షేత్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Kasireddy nayana  omkara kshetram  nityannadanam  bandi athmakur  andhra pradesh  

Other Articles

  • Sardar jamalapuram kesava rao biography telangana freedom fighter nizam ruling

    నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సర్థార్ జమలాపురం కేశవరావు

    Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more

  • Freedom fighter father of telangana konda laxman bapuji

    తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

    Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

  • Telanagana recalls professor jayashanker on his death annivesary

    తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

    Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

  • Prominent freedom fighter subash chandrabose biography

    అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

    Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

  • A tribute to ghantasala venkateswara rao on his birthday

    ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

    Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more