The Biography Of Carl Wilhelm Scheele Famous Scientist Who Found Oxygen Before Priestley

Carl wilhelm scheele famous scientist oxygen founder

Carl Wilhelm Scheele, Carl Wilhelm Scheele biography, Carl Wilhelm Scheele life story, oxygen founder, Joseph Priestley, Periodic table news

Carl Wilhelm Scheele Famous Scientist Oxygen Founder : Carl Wilhelm Scheele beat Priestley to the discovery but published afterwards. Oxygen was first discovered by Swedish pharmacist Carl Wilhelm Scheele. He had produced oxygen gas by heating mercuric oxide and various nitrates by about 1772

ప్రాణవాయువును కొనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త

Posted: 05/22/2015 01:12 PM IST
Carl wilhelm scheele famous scientist oxygen founder

మానవుడు పీల్చే శ్వాసలో ఆక్సిజన్ అనే మూలకం దాగివుందన్న విషయాన్ని జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. నిజానికి ఆక్సిజన్ మూలకం జోసెఫ్ ప్రీస్ట్‌లీ శాస్త్రవేత్త ద్వారా బయటి ప్రపంచానికి తెలుసుగానీ.. అంతకుముందు షీలే తన పరిశోధనల ద్వారా ఆ మూలకాన్ని తెలియజేశాడు. అంతేకాదు.. మాలిబ్డనం, టంగస్టన్, బేరియం, హైడ్రోజన్, క్లోరిన్ వంటి మూలకాలను ఇతర శాస్త్రవేత్తలు తెలియజేయక ముందే షీలే కనిపెట్టాడు. ఇతను కనిపెట్టిన ఆ మూలకాలను ఇతర శాస్త్రవేత్తలు పరిశోధనల చేసి.. ప్రచురించారు. దీంతో ఇతనిని ‘హార్డ్ లక్ షీలే’ అని పిలిచేవారట!

జీవిత చరిత్ర :

1742 డిసెంబర్ 9వ తేదీన స్ట్రాల్సండ్, స్వీడిష్ పొమెరానియాలో జన్మించాడు. షీలే తన 14వ ఏటలో ‘గూటెన్‌బర్గ్’ నందు గల ఔషధతయారీ పరిశ్రమలో ఒక అప్రెంటిస్ గా చేరాడు. అక్కడే 8 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఒక వైద్యుని వద్ద సహాయకునిగా ఉన్నాడు. తర్వాత అతడు స్టాక్ హోం నందు ఔషధ నిర్మాతగా ఉన్నాడు. 1770 నుండి 1775 వరకు ‘ఉప్ప్సలా’లో.. తరువాత కోపెన్ లో ఉన్నాడు. షీలే తన జీవితంలో ఎక్కువకాలం జర్మన్ మాట్లాడుటకు ఇష్టపడేవాడు. జర్మన్ భాషను స్వీడిష్ ఔషధ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడేవాడు.

షీలే ఆక్సిజన్ తయారుచేయడానికి ముందు గాలిని గూర్చి అధ్యయనం చేశాడు. గాలి పర్యావరణంలో తయారైన ఒక మూలకం అనీ, అది రసాయన చర్యలు జరుపుతుందని, కానీ అది రసాయన చర్యలలో పాల్గొనదని ఆలోచించసాగాడు. షీలే గాలిలో రెండు రకాల వాయువులుంటాయని.. అవి మండుటకు దోహదపడే గాలి, మలిన గాలి అని (ఫైర్ ఎయిర్, ఫోల్ ఎయిర్) పరిశోధన చేశాడు. ఆయన కొన్ని రసాయన పదార్థములైన పొటాషియం నైట్రేట్ , మాంగనీస్ డై ఆక్సైడ్ , భార లోహ నైట్రేట్లను, సిల్వర్ కార్బొనేట్, మెర్క్యురిక్ ఆక్సైడ్ లను మండించి కొన్ని ప్రయోగాలు నిర్వహించాడు. ఆ ప్రయోగాలలో ఆయన ఒకే ధర్మములు కల వాయువును గుర్తించాడు. అది పైర్ ఎయిర్ అని ఊహించాడు. ఆయన పరిశోధనలను 1775లో ప్రచురించుడానికి ఇచ్చాడు కానీ అది 1777 వరకు ప్రచురితం కాలేదు. ఆ సమయంలో జోసెఫ్ ప్రీస్ట్‌లీ, లావోయిజర్ లు ఆక్సిజన్ మరియు ప్లోజిస్టాన్ సిద్ధాంతం గూర్చి వారి ప్రయోగ వివరాలను ప్రచురించారు.

షీలే ఆవిష్కరించిన మరిన్ని మూలకాలు :

షీలే ఆక్సిజన్ ను ఆవిష్కరించడంతో పాటు.. ఇతర మూలకాలైన బేరియం(1774), మాంగనీస్(1774), మాలిబ్డనం(1778), టంగస్టన్(1781)ల ఆవిష్కరించాడు. అలాగే.. మరికొన్ని రసాయన పదార్థాలైన సిట్రిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము, హైడ్రోజన్ సైనైడ్(ప్రూసిక్ ఆమ్లం జలద్రావణం), హైడ్రోజన్ ప్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ లను కూడా కనుగొన్నాడు. వీటికి తోడు ‘పాశ్చురైజేషన్’ కు సమానమైన విధానాన్ని కూడా షీలే కనుగొన్నాడు. ద్రవ్యరాశిని ఉత్పత్తిచేసే పాస్ఫరస్ ను 1769లో కనుగొన్నాడు. ఇది అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగపడే ముఖ్యమైన పదార్థము. 1774లో అతి ముఖ్యమైన క్లోరిన్ వాయువు ఆవిష్కరణను చేశాడు.

భార లోహాలతో చర్యలు జరిగేటపుడు షీలే చేసే ప్రయోగాలు చాలా ప్రమాదకరమైనవిగా వుండేవి. షీలేకు ఆయన కనుగొన్న పదార్థములు, వాటి నుండి ఏర్పడిన వాటిని వాసన, రుచి చూసే చెడు గుణం వుండేది. అదే ఆయన ప్రాణాలను బలితీసుకుంది. ఒకనాడు మెర్క్యూరీ, లెడ్, వాటి సంయోగ, మరికొన్ని ఇతర పదార్థముల ప్రమాదకర ఫలితాల ఫలితంగా షీలే కోపెన్ నగరంలో 1786, మే 21లో మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Carl Wilhelm Scheele  Oxygen founder  Joseph Priestley  

Other Articles

 • Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

  క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

  Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more

 • Freedom fighter father of telangana konda laxman bapuji

  తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

  Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • A tribute to ghantasala venkateswara rao on his birthday

  ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

  Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more

Today on Telugu Wishesh