Konda Laxman Bapuji is the Real Father of Telangana తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

Freedom fighter father of telangana konda laxman bapuji

Konda Laxman Bapuji, Father of Telangana, Freedom Fighter bapuji, mulki movement, Telangana movements, bapuji resigns ministry, first telangana resignation, Telangana bapuji history, Telangana

Indian Freedom Fighter and Father Of Telangana Konda Laxman Bapuji, who witness the three movements for telangana state.

తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

Posted: 10/02/2018 06:42 PM IST
Freedom fighter father of telangana konda laxman bapuji

తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ కోసం పాటు పడ్డారు. ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో, ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం. తన ఆస్తి పాస్తులను, జీవితాన్ని మొదట్లో స్వతంత్ర ఉద్యమం కోసం, తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కోసం అవిరైనా.. ఏమాత్రం ఆలోచించకుండా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని కొనసాగించిన మహానేత.

నిజాం పాలనపై నిప్పుల యుద్దం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. నిజాంను ధైర్యంగా ఎదర్కొన్న ధీశాలి ఆయనే. బాపూజీ పోరాటాల చాప్టర్లు ఐదు రకాలుగా విడదీసుకోవాలి. నిజాంమీద పోరాటం మొదటిది. భారత స్వతంత్ర ఉద్యమం రెండోది. ముల్కీ ఉద్యమం మూడోది. 1969 తెలంగాణ పోరాటం నాలుగోది. తాజాగా జరిగిన తెలంగాణ ఉద్యమం ఐదోది.

భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి  చలించిపోయారు. బాధలనుండి విముక్తి దొరకాలంటే, ప్రత్యేక రాష్ర్టం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతీ సారి ఆయన  తన నిరసన స్వరాన్ని వినిపించారు.

పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా కూడ అనుక్షణం ప్రజలవైపే నిలబడ్డారు బాపూజీ. తన ప్రాణాల మీదకు వచ్చినా సరే, నమ్ముకున్న బాటను వీడిచి పెట్టలేదు. అందుకే, బాపూజీ మూడుతరాలవారికి తెలంగాణ ఉద్యమ వారధిలా నిలిచారు. అలనాటి నిజాం సంస్థానంలోని వాంకిడిలో 1915లో సెప్టెంబర్ 27న  జన్మించారు బాపూజీ. తొంభై ఏడో ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఈ లోకంలో ఉన్న 97 ఏళ్ళూ కూడా అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు.

1952 ప్రాంతాల్లో ముల్కీ ఉద్యమంలో మొదలైంది తెలంగాణ కోసం పోరాటం. 1969లో….అంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఉద్యమం పదును పెంచడానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. ఆ సమయంలో తెలంగాణలోనే తన రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పి.. అప్పటి నుంచి రాజకీయాలను నుంచి తప్పుకుని తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలో యువతకు స్పూర్తిని కల్పించారు.

ఇటీవలి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 ఏళ్ల వయస్సులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిముషం వరకూ  చిత్త శుద్దితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు. 1952లో అసిఫాబాద్ నుంచి గెలిచి చట్ట సభలో అడుగు పెట్టారు బాపూజీ.

చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు. అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరయ్యారు. మంత్రివర్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. చేయాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేసేవారు. ముఖ్యమంత్రి పదవి రెండుసార్లు ఆయనను వరించబోయింది. కానీ, చివరిక్షణాల్లో వేరేవాళ్ళు ఎగరేసుకుపోయారు. వెనకబడితన తరగతులకు చెందిన వ్యక్తి కావడంవల్లనే ముఖ్యమంత్రి కాలేకపోయారని బాపూజీ శిష్యులంటారు.

తన ఆస్తులను, జీవితాన్ని జనం కోసం ధారపోసిన ఈ నాయకుణ్ణి మన ప్రభుత్వాలు నిలువునా మోసం చేశాయి. ఆయన ఆస్తుల్లో జలద్రుశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన  నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రం అయింది. తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ పుట్టింది అక్కడే. అలాంటి మహానేత పరమపదించిన సమయంలో ఢిల్లీలో వున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం బాపూజీ కడసారి చూపుకోసమే.. అంతక్రియల సమయానికి కూడా హాజరుకాకపోవడంతో ఆయన శిష్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తించి సవినయంగా స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Sardar jamalapuram kesava rao biography telangana freedom fighter nizam ruling

  నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సర్థార్ జమలాపురం కేశవరావు

  Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more

 • Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

  క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

  Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • A tribute to ghantasala venkateswara rao on his birthday

  ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

  Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more