The Biography of Nadendla Bhaskara Rao Who is 11th chief minister of united AP | Member of Indian parliament

Nadendla bhaskara rao biography member of indian parliament 11 chief minister of ap

Nadendla Bhaskara Rao, Nadendla Bhaskara Rao history, Nadendla Bhaskara Rao biography, Nadendla Bhaskara Rao life story, Nadendla Bhaskara Rao with NTR, tdp party, tdp party organisation, NT Ramarao

Nadendla Bhaskara Rao biography Member of Indian Parliament 11 Chief Minister of AP : The Biography of Nadendla Bhaskara Rao Who is 11th chief minister of united AP. Present he is Member of the Indian Parliament for Khammam.

రామారావుతో కలిసి ‘టీడీపీ’ని స్థాపించిన నాదెండ్ల

Posted: 06/23/2015 03:26 PM IST
Nadendla bhaskara rao biography member of indian parliament 11 chief minister of ap

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.. ఆంధ్రులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించిన విషయం తెలిసిందే! ఈ పార్టీని స్థాపించిన వారిలో ఎన్టీ రామారావుతోపాటు మరికొందరు ముఖ్యనేతలు కూడా వున్నారు. ఆ నేతల్లో మొదటిగా వినిపించే పేరు నాదెండ్ల భాస్కరరావు. ఆంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా ఈయన ఎన్టీఆర్ తో కలిసి టీడీపీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జీవిత చరిత్ర :

1935 జూన్ 23వ తేదీన గుంటూరులో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. 1958లో లలిత భాస్కరరావును వివాహము చేసుకున్న ఈయనకు ఇద్దరు కుమారులు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందిన ఈయన.. న్యాయవాద వృత్తిలో చేరారు. కొన్నాళ్లు న్యాయవాదిగా కొనసాగిన ఆయన.. రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. అలా రాజకీయాల్లో వచ్చిన ఈయన.. 1978 శాసనసభ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గము నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1978 నుండి 1989 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఈయన.. ఆ కాలములోనే మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం స్థాపనలో నాదెండ్ల పాత్ర :

1982, మార్చి29న నందమూరి తారక రామారావుతో కలిసి నాదెండ్ల భాస్కరరావు ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించారు. 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘనవిజయం సాధించగా.. రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన ఆర్ధిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

టీడీపీ పార్టీలో కలహాలు :

1984 ఆగస్టు 13వ తేదీన ఎన్‌.టీ.రామారావు టెక్సస్ లో గుండెకు  బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాదుకు తిరిగివచ్చారు. అప్పుడు ఈయనను కలిసిన గవర్నర్ రాంలాల్.. ఆయన సూచన మేరకు భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన.. తనకు ముఖ్యమంత్రి అయ్యే మద్దతు వుందని తెలిపి అందుకు అవకాశమివ్వాలని కోరారు. ఇంతలోనే ఆయన ఎన్టీరామారావుకు మద్దతునిస్తున్న 163 మంది సభ్యుల జాబితా గవర్నరకు పంపారు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశారు కానీ.. గవర్నర్ ఇరు పక్షాల మద్దతును ప్రత్యక్షముగా అంచనా వేయకుండా రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయనకు గవర్నర్ అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెలరోజులు గడువిచ్చారు. మరోవైపు.. రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావును ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది. ‘తెలుగుదేశం పార్టీ’ తన ఆలోచనల రూపమే అని చెప్పుకున్న భాస్కరరావు.. ఆ తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పుచేశానని చింతించారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nadendla Bhaskara Rao  NT RamaRao  TDP Party  

Other Articles