The Biography Neelam Sanjiva Reddy Who Is 6th President Of Indian Country

Neelam sanjiva reddy biography indian 6th president

Neelam Sanjiva Reddy news, Neelam Sanjiva Reddy history, Neelam Sanjiva Reddy wikipedia, Neelam Sanjiva Reddy biography, Neelam Sanjiva Reddy life story, indian presidents list, Neelam Sanjiva Reddy former president of india

Neelam Sanjiva Reddy Biography Indian 6th President : The Biography Neelam Sanjiva Reddy Who Is 6th President Of Indian Country. He is Well Honored by people as best politician in history.

ప్రజల మన్ననలను పొందిన భారత 6వ రాష్ట్రపతి

Posted: 05/20/2015 07:38 PM IST
Neelam sanjiva reddy biography indian 6th president

‘పైన పటారం.. లోన లొటారం’ అని రాజకీయానికి పెట్టింది పేరు. ఎందుకంటే.. గెలవకముందు రాజకీయ నాయకులు చేసే హామీలు ఒకటైతే.. గెలిచిన తర్వాత చేసే పనులు అందుకు విరుద్ధంగా వుంటాయి. నేతలు తమ పదవిని కాపాడుకోవడం కోసం ప్రజల యోగాక్షేమాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నో తప్పులు చేస్తుంటారు. అంటే.. ప్రజలకు యోగ్యంగా నడుచుకున్న నేతలు చాలా అరుదు అని ఇక్కడి సారాంశం! కానీ.. కొందరు మాత్రం తమ పదివిని ఏమాత్రం ఆశించకుండా ప్రజల కోసం పోరాడిన నేతలు రాజకీయరంగంలో వున్నారు. అలాంటివారిలో నీలం సంజీవరెడ్డి ఒకరు. భారత 6వ రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన ఈయన.. ప్రజల మన్ననలను పొందిన గొప్ప రాజకీయ వేత్త!

జీవిత చరిత్ర :

1913 మే 18వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో సంజీవరెడ్డి జన్మించారు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నారు. 1935 జూన్ 8న నాగరత్నమ్మతో ఈయనకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం :

అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలతో ఈయన రాజకీయ చరిత్ర కొనసాగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 నుండి 1970 వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది. ఆ వ్యవహారాల గురించి చర్చించుకుంటే..

సంయుక్త మద్రాసు రాష్ట్రంలో : 1929లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు ఈయన దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని.. జైలుకు వెళ్ళారు. 1946లో మద్రాసు శాసనసభకు, 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు.

ఆంధ్ర రాష్ట్రంలో : 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. మళ్ళీ 1955లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వంలోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది.

ఆంధ్ర ప్రదేశ్ లో : ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రతరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా వున్న ఈయన కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యారు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29న తనపదవికి రాజీనామా చేసారు.

ఈ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఈయన.. కేంద్రంలోనూ వివిధ పదవుల్లో కొనసాగుతూ రాష్ట్రపతిగా ఎదిగారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి. 1982లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు. 1996 జూన్ 1న నీలం సంజీవరెడ్డి మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neelam Sanjiva Reddy  Indian presidents List  

Other Articles

Today on Telugu Wishesh