Biography of jiddu krishnamurti who a famous speak on philosophical and spiritual subjects

Jiddu krishnamurti biography philosophical and spiritual speaker

jiddu krishnamurti updates, jiddu krishnamurti biography, jiddu krishnamurti life story, jiddu krishnamurti wikipedia, jiddu krishnamurti telugu updates, jiddu krishnamurti speaker, telugu famous speakers, philosophical speakers, telugu people

jiddu krishnamurti biography philosophical and spiritual speaker : Jiddu Krishnamurti was a speaker and writer on philosophical and spiritual subjects. In his early life he was groomed to be the new World Teacher but later rejected this mantle and disbanded the organisation behind it. His subject matter included psychological revolution, the nature of mind, meditation, inquiry, human relationships, and bringing about radical change in society.

మూఢవిశ్వాసాలను పాలద్రోలేందుకు తీవ్ర కృషిచేసిన తత్వవేత్త

Posted: 05/15/2015 03:39 PM IST
Jiddu krishnamurti biography philosophical and spiritual speaker

ఏ విధంగా అయితే దేశం సంస్కృతీ-సంప్రదాయాలకు పెట్టింది పేరుగా పరిగణించబడుతుందో.. అదేవిధంగా మూఢనమ్మకాలను నిలయంగానూ పిలువబడుతుంది. ప్రపంచదేశాలన్నీ సాంకేతిక, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతూ దూసుకెళుతుంటే.. భారత్ లో మాత్రం ప్రజలకు సరియైన జ్ఞానం లభించకపోవడంతో దేశం మూఢవిశ్వాసాల అంధకారంలో మునిగిపోతోంది. ప్రస్తుతకాలంలోనూ ‘మూఢ’ ప్రచారాలు చాలా అరుదు కానీ.. 20వ శతాబ్దకాలంలో మాత్రం దాని హవా ఎక్కువగా వుండేది. చాలావరకు దానిమీదే ఆధారపడుతూ జీవనం కొనసాగించేవారు.

అలాంటి సమయంలో కొందరు వ్యక్తులు తమ ప్రసంగాలతో ‘మూఢ’ అనే పదాన్ని పాలద్రోలేందుకు తీవ్ర కృషి చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు తమ జీవితాలనే త్యాగం చేశారు. ప్రపంచదేశాలకు పోటీగా భారత్ ను సైతం నిలబెట్టాలంటే ముందు ఈ ‘మూఢ’ ప్రచారాన్ని శాశ్వతంగా నిర్మూలించన్న లక్ష్యంతోనే అడుగులు వేశారు. అలాంటి వారిలో ‘జిడ్డు కృష్ణమూర్తి’ ఒకరు. ప్రముఖ తత్వవేత్త అయిన ఈయన.. మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. మూఢనమ్మకాల నుంచి విముక్తి చెందాలని బోధించాడు.

జీవిత చరిత్ర :

1895 మే 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం మార్చారు. మద్రాసులోని ‘అడయారు’ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలిగా వున్న అనీబిసెంట్ కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద ఇద్దరినీ విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ పంపించింది. దీంతో కృష్ణమూర్తి పారిస్ లోని సారబాన్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయగలిగారు. అయితే.. తన కొడుకులిద్దరి తిరిగి రప్పించాలంటూ అనీబీసెంట్ మీద కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఆమె ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే.. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసించేది. ఆ మేరకే ఆమె ప్రపంచమంతా చాటింది. అయితే.. జిడ్డు కృష్ణమూర్తి ఏనాడూ తనని తాను జగద్గురువుగా వెల్లడించలేదు.

ఇలా సమయం గడుస్తుండగా.. కృష్ణమూర్తి సోదరుడు జబ్బు బారిన పడ్డాడు. దీంతో ఆయన తన సోదరుడిని తీసుకుని అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 1925లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. అతని మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. నిజానికి ఆయన తన చిన్నప్పట్నుంచీ ఏ విషయాన్ని పూర్తిగా నమ్మవారు కాదు. ప్రతీ విషయాన్నీ శంకించేవారు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో ఆయన దృక్పథం మరింత బలం చేకూర్చింది.

తత్వవేత్తగా :

కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్’ అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం దానికి కృష్ణమూర్తి ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ.. ఏమీ చెప్పలేదు. సోదరుని మరణంతో ఆయనలో చాలా మార్పు వచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు కానీ.. అందుకు ప్రతీకగా వచ్చిన గౌరవాలను నిరాకరించాడు. సాధారణ జీవితాన్నే గడపేవారు.

అయితే.. అధికారపూ ర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఈయనమీద ఎక్కువైంది. ఆ పీఠాన్ని అధిష్టించడం ఇష్టంలేక ఆయన దానిని ధిక్కరించాడు. 1929లో హాలెండ్ లోని ‘ఆమెన్’లో తాను జగద్గురువు కాదని ప్రకటించి, ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్’ను రద్దుపరిచాడు. ఇతడు చేసిన ఈ మహాత్యాగానికి జగమంతా ఆశ్చర్యపోయింది. డాక్టర్ అనిబిసెంట్ తోపాటు చాలామంది నిరాశతో బాధపడ్డారు. తన అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని తేల్చి చెప్పేశారు. ఇక అప్పటినుంచి ఆయన కృష్ణముర్తి స్వతంత్ర్య మానవుడిగా స్వేఛ్చను పొందారు. ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి విమర్శలు వచ్చినప్పటికీ జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.

‘మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని’ ఆయన బోధించసాగాడు. 1929 నుండి 1986 తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజం లో మౌలిక మార్పు. ఈయన 1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియాలో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jiddu krishnamurti  philosophical telugu speakers  

Other Articles