Charles phillip brown biography telugu literature kadapa

charles phillip brown news, charles phillip brown birthday special, charles phillip brown birthday news, charles phillip brown latest news, charles phillip brown death day, charles phillip brown birthday, charles phillip brown biography, charles phillip brown wikipedia, charles phillip brown wiki, charles phillip brown life history, charles phillip brown life story, charles phillip brown story, telugu literatures

charles phillip brown biography telugu literature kadapa

తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు

Posted: 11/10/2014 12:40 PM IST
Charles phillip brown biography telugu literature kadapa

తెలుగు సాహిత్యరంగానికి విశేష సేవలందించినవారు ఎంతోమంది మహనీయులు వున్నారు. అయితే వీరందరిలోనూ ఒక ఆంగ్లేయుడు కూడా వుండటం విశేషం! అతని పేరు ‘‘ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్’’! ఆయన కూడా తెలుగు రచయితల్లాగా సాహిత్యరంగం కోసం ఎంతో కృషి చేశారు. నిజానికి తెలుగుజాతికి సేవ చేసినవాళ్లు నలుగురు ఆంగ్లేయులు వున్నారు. అయితే వారందరిలోనూ ఈయనే ఎక్కువగా కృషి చేశారంటూ పరిగణిస్తారు. మిగతా ముగ్గురు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదుగానీ.. చార్లెస్ మాత్రం తనదైన రీతిలో సాహిత్యానికి సేవలందించి చెరగని ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించారు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు.

జీవిత చరిత్ర :

1798 నవంబర్ 10వ తేదీన కలకత్తాలో సి.పి.బ్రౌన్ జన్మించారు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ కూడా బాగా పేరొందిన గొప్ప క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన అనంతరం బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. అయితే బ్రౌను అక్కడికి వెళ్లిన తరువాత కూడా పట్టువదలకుండా హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. ఇండియాతో ముడిపడిన సంబంధాలు మేరకు అతను ఎక్కువకాలం ఇంగ్లాండులో వుండలేకపోయాడు. అందుకే... 1817 ఆగష్టు 4న మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు. కానీ తెలుగు మాట్లాడటంలో అంతగా ప్రావీణ్యం పొందలేదు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఇలా రకరకాల విభాగాల్లో అతను ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు. అయితే ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. దాంతో తెలుగు పూర్తిగా నేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఆనాడు తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానాలు అందుబాటులో లేకపోవడం వల్ల పండితులు తమతమ సొంత పద్ధతుల్లో బోధించేవారు. అయితే తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యే బ్రౌనును తెలుగు భాషా పరిశోధన కోసం పురికొల్పింది. అతను తెలుగులో ఎలాగైనా పూర్తి ప్రావీణ్యం సాధించాలనే పట్టుదలతో తనదైన శైలిలో అడుగులు వేశాడు. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, అవన్ని ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించాడు. అలాగే భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. కొన్ని తెలుగుప్రాంతాల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు బ్రౌను. కడపలోనే ఒక బంగళా కొని, తన సొంత డబ్బుతో పండితులను నియమించుకున్నాడు. అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షించేవారు.

అంతేకాదు.. ఆనాడు ఛార్లెస్ బ్రౌను కడప, మచిలీపట్నం పాఠశాలలు పెట్టి, విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజనవసతి కల్పించాడు. తన తగ్గరున్న సంపాదనను పేదవారికి దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. అయితే నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. పైగా 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో అతను తీవ్ర అసంతృప్తికి గురయి తిరిగి ఇంగ్లాండుకు వెళ్లిపోయాడు. కానీ ఎక్కువకాలం అక్కడ వుండలేక తిరిగి 1837లో ఒక కంపెనీలో పర్షియన్ అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు.

తెలుగు భాషకు సి.పి.బ్రౌన్ చేసిన కృషి :

1. వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
2. 1841లో ‘‘నలచరిత్ర’’ను ప్రచురించాడు.
3. ‘‘ఆంధ్రమహాభారతము’’, ‘‘శ్రీమద్భాగవతము’’లను ప్రచురించాడు.
4. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
5. లండన్‌లోని ‘‘ఇండియాహౌస్ లైబ్రరీ’’లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
6. ‘‘హరిశ్చంద్రుని కష్టాలు’’ గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
7. 1844లో ‘‘వసుచరిత్’’, 1851లో ‘‘మనుచరిత్ర’’ ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
8. 1852లో ‘‘పలనాటి వీరచరిత్ర’’ ప్రచురించాడు.

ఇతర విషయాలు :

1832-33లో గుంటూరు నగరంలో వచ్చిన కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో అక్కడి ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charles phillip brown  telugu lliteratures  famous telugu writers  telugu news  

Other Articles