Abdul karim khan biography indian classical singer kirana gharana

abdul karim khan news, abdul karim khan latest news, abdul karim khan birthday special, abdul karim khan indian classical singer, abdul karim khan classical singer, abdul karim khan biography, kirana gharana, indian classical singers

abdul karim khan biography indian classical singer kirana gharana

క్లాసికల్ మ్యూజిక్ ప్రపంచంలో ప్రముఖ విద్వాంసుడు!

Posted: 11/11/2014 01:03 PM IST
Abdul karim khan biography indian classical singer kirana gharana

ప్రస్తుతకాలంలో క్లాసికల్ మ్యూజిక్ అంతగా ప్రాచుర్యంలోకి లేదుకానీ.. గత దశాబ్దాలక్రితం మాత్రం దీని హవాయే ఎక్కువగా నడిచేది. అప్పట్లో ఆ క్లాసికల్ మ్యూజిక్ లో ఎంతోమంది తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్లు చాలామందే వున్నారు. ఒకరికొకరు పోటాపోటీతో రంగంలోకి దిగేవారు. ఎంతోమంది ప్రముఖులు కూడా వున్నారు. అటువంటివారిలో అబ్దుల్ కరీంఖాన్ లేదా ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ కూడా ఒకరు. ఈయన 20వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.

జీవిత చరిత్ర :

1872 నవంబర్ 11వ తేదీన ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో అబ్దుల్ కరీంఖాన్ జన్మించారు. ఈయన తండ్రి పేరు కాలే ఖాన్. ఆనాడు కిరణా ఘరానాకు మూలపురుషులైన గులాం అలీ మనవడు కాలే ఖాన్! కరీంఖాన్ తన తండ్రి, మామ అబ్దుల్లా ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందారు. అతి తక్కువ సమయంలోనే సంగీతంలో వున్న వివిధ నైపుణ్యాలను సంపాదించేసుకున్నారు. . గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా అన్నింటినీ నేర్చుకున్నారు కరీంఖాన్!

సంగీత ప్రస్థానం :

కరీంఖాన్ మొదట్లో సారంగి వాయించడం మొదలుపెట్టినా.. క్రమక్రమంగా ఆయన గాత్రాన్ని నేర్చుకున్నాడు. అలా నేర్చుకోవడం వల్ల ఆయన తన సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాటలు పాడేవాడు. ఒకనాడు బరోడా రాజువారి దర్బార్ లో పాటలు పాడే ప్రదర్శనలో కరీంఖాన్ అద్భుతంగా తన గాత్రాన్ని వినిపించడం వల్ల అందుకు రాజు ముగ్ధుడై వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించుకున్నారు. దాంతో కరీంఖాన్ దశ అక్కడినుంచి ఒక్కసారిగా తిరిగిపోయింది. అక్కడే ఆయన రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను వివాహం చేసుకున్నారు.

వివాహ జీవితం :

అయితే కొన్నాళ్ల తర్వాత ఆ దంపతులు బరోడా నుంచి బహిష్కృతులై, ముంబై చేరుకున్నారు. అక్కడ కూడా కొన్నాళ్లపాటు సజావుగానే తమ జీవితాన్ని ఆస్వాదించిన వాళ్లిద్దరి మధ్య అనుకోని తగాదాలు రావడం వల్ల 1922లో కరీంఖాన్ తన భార్యను వదిలేసి వెళ్లిపోయారు. అప్పడు ఆయన జీవితంలో ఎన్నో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరికొన్ని విషయాలు :

మైసూరు దర్బారులో వున్నప్పుడు అక్కడ గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం వల్ల వారి ప్రభావం కరీంఖాన్ పాటల్లో కనిపించేది. 1900లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలవరకు సంగీతాన్ని నేర్పించారు. అలాగే అక్కడే మరో ప్రసిద్ధి సంగీత విద్వాంసురాలు కేసర్‌బాయ్ కేర్కర్కు శిక్షణ ఇచ్చారు. 1913లో పుణెలో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abdul karim khan  indian classical singers  kirana gharana  telugu news  

Other Articles