Tollywood commedian amanchi venkata subramanyam biography

amanchi venkata subramanyam, avs biography, amanchi venkata subramanyam news, amanchi venkata subramanyam life story, amanchi venkata subramanyam life history, amanchi venkata subramanyam wikipedia, comedian amanchi venkata subramanyam

tollywood commedian amanchi venkata subramanyam biography

తెలుగుచిత్రపరిశ్రమలో చిరస్మరణీయమైన హాస్యనటుడు

Posted: 11/08/2014 03:27 PM IST
Tollywood commedian amanchi venkata subramanyam biography

తెలుగు చలనచిత్రపరిశ్రమలో ఇప్పటివరకు ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను బాగానే నవ్వించారు.. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే చిరస్మరణీయంగా నిలిచిపోయారు. అటువంటివారిలో ఎస్.వి.సుబ్రహ్యణ్యం ఒకరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. అనుకోకుండా వచ్చిన ఒక్క ఆఫర్ నుంచి తన నటనాప్రతిభను నిరూపించకుని గొప్ప హాస్యనటుడిగా ఎదిగారు. దాదాపు 450కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాదు.. ఈయన కొన్ని సినిమాలకు కథలు కూడా రాశారు. ఒక నిర్మాతగా, దర్శకుడిగా తన మెగాఫోన్లు చేపట్టారు. ఇక రాజకీయరంగంలోనూ తనదైన పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు.

జీవిత చరిత్రం :

1957 జనవరి 2వతేదీన గుంటూరు జిల్లా తెనాలిలో నివాసమున్న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు సుబ్రమణ్యం జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. ఆ కాలేజీ రోజుల్లోనే ఈయన రంగస్థల ప్రవేశం చేశారు. కళాశాల లెక్చరర్ నఫీజుద్దీన్ రాసిన నాటకాల్లో ఈయన నటిస్తుండేవారు. తర్వాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికారంగంలో జర్నలిస్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాటకాలలో ఈయనకు ఎక్కువ మక్కువ వుండేది. అందుకే లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండేవారు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు.

సినిమా జీవితం :

మొదట తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరిన ఆయన... ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేశారు. ఈ దశలోనే ఆయన చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ఆయనకు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. అంతే! ఇక అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా సినిమాల్లో కంటిన్యూ అయిపోయారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప హాస్యనటుడిగా పేరుగాంచారు.

రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవీఎస్‌.. కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు. ‘‘తుత్తి’’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘‘రంగుపడుద్ది’’, శుభలగ్నం సినిమాలో ‘‘గాలి కనపడుతుందా’’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 19 ఏళ్లలో సినీ కెరీర్ లో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించి... హాస్యనటుడిగా గొప్ప పేరు సాధించారు. అంతేకాదు... ‘‘అంకుల్’’ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. అలాగే ‘‘సూపర్ హీరోస్’’ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఆయన.. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు.

ఇదిలావుండగా.. 2008లో ఆయన కాలేయ సమస్యతో కొన్నాళ్లవరకు ఆసుపత్రిలోనే చికిత్సం పొందాల్సి వచ్చింది. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో ఆయన కుమార్తె తన కాలేయాన్ని దానం చేసింది. అనంతరం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దాంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించారు. అయితే కాలేయం వ్యాధి మళ్ళీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 2013, నవంబరు 8వ తేదీ రాత్రి కన్ను మూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amanchi venkata subramanyam  telugu comedians  tollywood news  telugu news  

Other Articles