The legendary actor kamal hassan biography birthday special

kamal hassan, kamal hassan latest news, kamal hassan birthday special, kamal hassan movie news, kamal hassan movie updates, kamal hassan life story, kamal hassan wikipedia, kamal hassan wiki, kamal hassan daughters, kamal hassan personal life story, kamal hassan updates, shruti hassan, akshara hassan

the legendary actor kamal hassan biography birthday special

విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసే బహుముఖ ప్రజ్ఞశాలి!

Posted: 11/07/2014 12:41 PM IST
The legendary actor kamal hassan biography birthday special

కమల్ హాసన్.. ద లెజెండరీ హీరో! తన నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన లోకనాయకుడు. పచ్చిగా చెప్పుకోవాలంటే.. చిత్రపరిశ్రమలో వున్నవాళ్లందరూ చాలావరకు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం ఎన్నో అవస్థలు పడితే... కమల్ హాసన్ మాత్రం కేవలం నటన కోసమే జన్మించారా..? అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే.. నటనలో ఆయనంతటి బహుముఖ ప్రజ్ఞశాలి మరెవ్వరూ వుండరు. సరికొత్త పాత్రలతో రకరకాల సినిమాల్లో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించడం ఈయనకు ఈయనే సాటి! అసలు కళలకు సంబంధంలేని కుటుంబంలో పుట్టిన కమల.. నేడు భారతదేశం గర్వించే నటుడిగా, ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంతుంటుందో ఊహించలేం!

జీవిత చరిత్రం :

1954 నవంబర్ 7వ తేదీని రామనాథపురం జిల్లా పరమకుడిలో శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు కమల్ జన్మించారు. బాల్యంలోనే శాస్త్రీయ కళలను అభ్యసించిన కమల్.. 6ఏళ్ల వయస్సులోనే ‘‘కలత్తూర్ కన్నమ్మ’’ సినిమా ద్వారా బాలనటుడిగా చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆ తొలిచిత్రంతోనే కమల్ తన నటనగొప్పతనాన్ని చాటినందుకుగానూ రాష్ట్రపతి అవార్డును, బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 21ఏళ్ల వయస్సులోనే హీరోగా అవతారమెత్తారు. హీరోగా ఆయన నటించిన తొలిచిత్రం ‘‘అపూర్వ రాగంగళ్’’ జాతీయ అవార్డును గెలుచుకుంది. అందులో ఆయన నటనకు ఫిలింపేర్ అవార్డు లభించింది.

వ్యక్తిగత జీవితం :

కమల్ హాసన్ మొదట వాణి గణపతి అనే ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే వారిమధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ... సారికతో తన జీవితాన్ని పంచుకున్నారు. వీరికి శృతి, అక్షర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం సారిక నుండి కూడా కమల్ విడిపోయి.. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నారు.

కమల్ నటన గొప్పతనం :

మొదట్లో పక్కా కమర్షియల్ చిత్రాల్లో స్టార్ ఇమేజ్‌ను సాంతం చేసుకున్న కమల్.. ఆ తరువాత సరికొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూ దూసుకెళ్లారు. ‘‘అమావాస్య చంద్రుడు’’ చిత్రంలో మూగవాడిగానూ.., అసలు మాటలే లేని చిత్రం ‘‘పుష్పక విమానం’’లోను తన నట చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. అలాగే ‘‘విచిత్ర సోదరులు’’ చిత్రంలో మరుగుజ్జువాడిగా నటించి ప్రపంచ సినిమానే తిరిగి చూసేలా చేశారు. ఇక ‘‘దశావతారం’’లో ఏకంగా పది వైవిధ్యభరిత పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ ప్రతి చిత్రం ఒక ప్రయోగమే. ‘‘నాయకన్, మహానది, గుణ, మైఖేల్‌మదన్‌కామరాజ్’’ ఇలా తాజా చిత్రం ‘‘విశ్వరూపం’’ వరకు అద్భుత ప్రయోగాలే.

కమల్ లో దాగివున్న కళలు :

కమల్ హాసన్ కేవలం నటనలోనే కాదు.. చిత్రపరిశ్రమలో వున్న వివిధ రంగాలలోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేశారు. ‘‘భరత నాట్యం’’ ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి! కమల్ నేపధ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు. అలాగే కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు. ఈ నూతన శతాబ్దంలో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అన్నీరంగాల్లో దూసుకుపోతున్నారు. ఏ ఇతర హీరోలకు సాధ్యంకాని విభిన్న పాత్రలు పోషించడంలో తనదైన ముద్రను వేసుకున్న కమల్... నేటికీ ఆ ప్రతిభనే ప్రదర్శిస్తూ ప్రేక్షకుల నుంచి మనన్నలు పొందుతున్నారు.

అవార్డులు - సత్కారాలు :

ఈయన కేవలం ఒక్క తమిళ భాషలోనే కాదు.. తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ భాషల్లోనూ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇలా ఈ విధంగా అన్ని చిత్రపరిశ్రమరంగాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయనకు.. ఎన్నో పురస్కారాలు అందాయి. బాలనటుడిగా తొలిచిత్రంతోనే అవార్డును కొల్లగొట్టడం ప్రారంభించిన ఈయన... నాలుగు జాతీయ అవార్డులతోపాటు పలు ప్రాంతీలు అవార్డులను, 19 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఈయన నటనాప్రతిభకుగానూ కేంద్రప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును, 2014లో పద్మభూషణ్ అవార్డుతోను ఘనంగా సత్కరించింది.

సామాజిక సేవ :

సాధారణంగా కమలహాసన్ ను నాస్తికుడిగా పేర్కొంటారు కానీ... ఆయనకు సామాజిక స్పృహ చాలా ఎక్కువే. కమల్ ‘‘నర్పని ఇయక్కం’’ (అభిమాన సంఘం) పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చెన్నై మాదంబాక్కం సమీపంలోని సరస్సులను శుద్ధి చేసే బృహత్తర కార్యక్రమాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం 60వ ఏటలోని అడుగులు పెడుతున్న ఈ లోకకథానాయకుడికి ‘‘తెలుగు విశేష్’’ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  shruti hassan  telugu legendary actors  tollywood news  telugu news  

Other Articles