Dasaradhi krishnamacharyulu biography who is famous wirter

dasaradhi krishnamacharyulu news, dasaradhi krishnamacharyulu history, dasaradhi krishnamacharyulu wikipedia, dasaradhi krishnamacharyulu wiki, dasaradhi krishnamacharyulu biography, dasaradhi krishnamacharyulu auto biography, dasaradhi krishnamacharyulu books, dasaradhi krishnamacharyulu photos, dasaradhi krishnamacharyulu images, dasaradhi krishnamacharyulu biography, telugu literatures, telangana protesters, telugu news

dasaradhi krishnamacharyulu biography who is famous wirter

నిజాంపాలన మీద కలం ఎక్కుపెట్టిన మహాకవి

Posted: 11/05/2014 03:52 PM IST
Dasaradhi krishnamacharyulu biography who is famous wirter

నిజాంపరిపాలనా కాలంలో తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఎంతోమంది ఉద్యమకారులతోపాటు కొందరు మహాకవులు కూడా తమ కలం ద్వారా సమాధానమిచ్చారు. అటువంటి వారిలో దాశరథి కృష్ణమాచార్య ఒకరు! తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. ఈయన తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన రచయిత! ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని గర్వంగా ప్రకటించిన ఈయన... ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు.

జీవిత చరిత్ర :

1925 జూలై 22వ తేదీన వరంగల్ జిల్లా గూడురు గ్రామంలో దాశరథి జర్మించారు. (ప్రస్తుతం ఆ గ్రామం ఖమ్మంలో వుంది). ఈయన బాల్యం మొత్తం ఖమ్మం జిల్లా మధిరలోనే గడిచిపోయింది. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించిన ఈయన.. ఉర్దులో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బీ.ఏ చదివారు. . సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ తదితర భాషల్లో మంచి పండితుడు అయిన ఆయన.. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. అంతేకాదు.. సాహిత్యంలోనూ ఆయన అనేక ప్రక్రియల్లో తనవంతు కృషి చేశారు. ఎన్నో కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసారు.

ఉద్యమ నేపథ్యం :

మొదట కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా వున్న ఈయన... రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చి, హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణా పేదప్రజలను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.  భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు.
‘‘రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్’’ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేశారు.

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాదులోని ఇందూరు కోటలో 150మందిత ఆయన్ను బంధీగా వుంచింది. ఆనాడు వాళ్లకు పళ్ళు తోముకోవడానికిచ్చిన బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి చాలా దెబ్బలు తిన్నారు. అనంతరం 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసారు. అనంతరం ఆయన అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.  రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నారు. అయితే ఆరోగ్య సమస్యల వల్ల 1987 నవంబరు 5న  మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasaradhi krishnamacharyulu  telugu literatures  telangana protests  telugu news  

Other Articles