Amartya sen biography who got nobel prize in economics

amartya sen biogaphy, amartya sen news, amartya sen birthday, amartya sen latest news, amartya sen auto biography, amartya sen news, amartya sen life story, amartya sen history, amartya sen life story, telugu literatures

amartya sen biography who got nobel prize in economics

‘‘నోబెల్’’ బహుమతి స్వీకరించిన తొలి దేశపు ఆర్థిక శాస్త్రవేత్త

Posted: 11/04/2014 03:25 PM IST
Amartya sen biography who got nobel prize in economics

నోబెల్ బహుమతి... ప్రపంచంలో చాలా అరుదైనది! అటువంటి అవార్డును అందుకున్న భారతీయుల్లో అమార్త్య కుమార్ సేన్ ఒకరు! భారతీయ తత్వశాస్త్రవేత్త అయిన ఈయన.. 1998లో మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థికశాస్త్రము, పేదరికానికి గల కారణాలు, పొలిటికిల్ లిబరలిస్మ్ లలో చేసిన విశేష కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది.

జీవిత చరిత్ర :

1933 నవంబర్ 3వ తేదీన బెంగాల్ లోని శాంతినికేతన్ లో అమర్త్యాసేన్ జన్మించారు. తండ్రి ఆశుతోష్ సేన్, తల్లి అమితా సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం బోధించేశారు. 1941లో ఢాకాలో హైస్కూలు విద్యను పూర్తిచేసిన ఈయన.. 1947లో దేశవిభజన అనంతరం భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెంట్ కళాశాలలో అభ్యసించారు. 1956లో కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నారు. అనంతరం 1959లో పీ.హెచ్.డీ పట్టా పుచ్చుకున్నారు.

వివాహ జీవితం :

అమర్త్యాసేన్ కు మొత్తం ముగ్గురు భార్యలు. మొదట 1960లో నవనీత దేవి అనే బెంగాలీ కవియిత్రిని వివాహం చేసుకున్నారు. వారిద్దరి అంతర, నందన అనే పిల్లలు కూడా వున్నారు. అయితే 1971లో లండన్ వెళ్ళిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వారి వివాహబంధం తెగిపోయింది. దీతో ఆయన నవనీతకు విడాకులిచ్చి, 1973లో ఎవా కొలొర్నీ అనే పాశ్చాత్య మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో క్యాన్సర్ వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పని చేస్తున్న ఎమ్మా జార్జిన రూత్‌చైల్డ్స్.

అర్థశాస్త్రంలో ఆయన అందించిన కృషి :

సంక్షేమం, పేదరికం, నిరుద్యోగం తదితర విభాగాల్లో అమర్త్యా సేన్ చేసిన కృషి ఎంతో అద్భుతమైనది. సంక్షేమ అర్థశాస్త్రంవైపు దృష్టి సారించిన ఆయన... ఏవిధంగా అయితే ప్రజలకు కనీస అవసరాలు ముఖ్యమో అదేవిధంగా ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పలికారు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని... ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే కారణమని కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించారు.  

ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని అంటూ పేర్కొన్న ఆయన... నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్తరూపం చేర్చారు. 1943 లో బెంగాల్ లో కరువు సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా... అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్రపరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్తరూపం ఇచ్చారు.

లభించిన అవార్డులు :

1. 1998లో అత్యున్నతమైన నోబెల్ బహుమతి స్వీకరించారు.
2. 1999లో భారత ప్రభుత్వపు ‘‘భారతరత్న’’ అవార్డుకు ఎంపికయ్యారు.
3. 2000లో లియోంటీప్ ప్రైజ్ పొందారు.
4. 2000లో అమెరికాదేశపు ఐసెన్ హోవర్ మెడల్ పొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amartya sen  indian nobel prize winners  indian famous literatures  

Other Articles