‘‘చరిత్రను సృష్టించాలన్న మేమే... దానిని తిరగరాయాలన్నా మేమే’’ అంటూ ‘సింహా’ సినిమాలో చెప్పిన డైలాగు మాదిరే... తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులను బద్దలు నమోదు చేయడంలో బాలకృష్ణ ఎల్లప్పుడూ ముందుంటారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నందమూరి బాలయ్య ముందున్న ఉత్సాహంతోనే వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, ప్రేక్షక జనాలను అలరిస్తున్నారు.
ఐదుపదుల వయస్సు దాటినప్పటికీ కూడా నవ యువకుడిలా అన్నిరకాల పాత్రలలో లీనమై.. నేటి యువ హీరోలకు ధీటుగా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతున్నారు. వైవిధ్యమైన పాత్రలను పోషించడమే కాకుండా... పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో పనిచేయడంలో కూడా ఈయనకు సాటి ఎవ్వరు వుండరు. అందుకు ఉదాహరణగా ఈయన నటించిన ‘‘శ్రీరామరాజ్యం’’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.
కేవలం చిత్రపరిశ్రమలోనే కాదు... రాజకీయ రంగంలో కూడా తన సత్తాను చాటుకున్నారు నందమూరి బాలయ్య. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణకు తెలుగువిశేష్ తరఫున హార్థికపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు.
బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమైన బాలకృష్ణ... ఇప్పటికీ కథానాయకుడిగానే నటిస్తూనే తన చిత్ర ప్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. చిత్రసీమలో ప్రవేశమై 40 సంవత్సరాలు పూర్తయినప్పటికీ.. ఆయన నటనలో ఎటువంటి మార్పు రాలేదు. కొత్త పాత్రలు చేసుకుంటూ తన ప్రతిభను మరింత పెచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. చేసే ప్రతి ఒక్క పాత్ర, వేసే ప్రతి అడుగు సరికొత్తగా వుండేవిధంగా ప్రతిక్షణం తపించే కథానాయకుడు ఈ బాలయ్యం. తన సినిమా కెరీర్ లో విభిన్నమైన పాత్రలను పోషించి, తెలుగుప్రజల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నారు.
బాలకృష్ణలో వుండే ఆ వైవిధ్యమైన స్వభావమే ఆయనను ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిపేందుకు ఎంతో సహాయపడ్డాయి. భైరవద్వీపం సినిమా గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. అందులో ఈయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. దాంతో ఆ చిత్రానికి బాలకృష్ణకు 1994వ సంవత్సరంలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తరువాత నటించిన సినిమాలు కొంతవరకు నిరాశపరిచినప్పటికీ.. బాలయ్య మాత్రం ఓటమిని అంగీకరించలేదు. కొత్తకొత్త కథలతో ప్రయోగాలు చేసుకుంటూనే వెళ్లారు.
అందులో భాగంగానే 2001లో ఈయన నటించిన ‘‘నరసింహ నాయుడు’’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా నంది అవార్డును పురస్కరించింది. అలాగే సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన వైవిధ్యమైన పాత్రలను పోషించారు. 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో ఈయనను సత్కరించారు.
శ్రీమన్నారాయణ, అల్లరిపిడుగు, అధినాయకుడు వంటి మొదలైన చిత్రాలు ఈయనకు తీరని నిరాశను మిగిల్చాయి. అయితే బాలయ్య ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తన సినీ కెరీర్ ని ముందుకు తీసుకెళ్లారు. 2010లో బోయపాటి శ్రీనుతో జతకట్టిన బాలయ్య గారు సింహా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం బాలకృష్ణ సినీ చరిత్రనే తిరగరాసేసింది. ఒక్కసారిగా బాక్సాఫీసు రికార్డులు బద్దలయిపోయాయి. ప్రస్తుతం వచ్చిన లెజెండ్ సినిమా కూడా సరికొత్త రికార్డులను సృష్టించి, బాలకృష్ణకు ఒక సరికొత్త ఇమేజిని తెచ్చిపెట్టింది.
ఇక రాజకీయపరంగా కూడా బాలకృష్ణగారు సరికొత్త చరిత్రనే సృష్టించారు. తండ్రి బాటలోనే తాను నడుస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నకలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయన మీద వున్న నమ్మకంతో ఆ ప్రాంత ప్రజలు కూడా ఈయనను భారీ మెజారిటీతో గెలిపించారు.
దానికి బాలకృష్ణ ఎంతో సంతోషిస్తూ.. అక్కడ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా వుంటానని, ప్రాంత ఉనికికి సరిచేస్తానని, ప్రజల ఉన్నతికి ఎల్పప్పుడూ పాటుపడతానని మాటిచ్చారు. తన జన్మదిన వేడుకలను హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణా స్టూడియోస్ లో అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. తన అమ్మగారి పేరుమీదున్న బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తానని మాటిచ్చారు.
జన్మదిన వేడుకల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘‘ఈ సంవత్సరం నేను జరుపుకుంటున్న జన్మదిన వేడుకలు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే తెలుగుప్రజలు నామీదున్న నమ్మకంతో నన్ను హిందూపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నివిధాల సేవలందిస్తానని మాటిస్తున్నాను’’ అని చెప్పారు.
మరోవైపు నేటి యువతర హీరోయిన్లతోపాటు అందరూ సినీ తారలు బాలయ్యతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈయనతో సినిమాలు చేస్తే.. ఇటు చిత్రసీమలోను.. అటు రాజకీయరంగంలో మంచి పేరు సంపాదించుకోవచ్చుననే భావనతో అందరి కన్ను ఈయనమీద పడిందని ఫిలింనగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more