ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో ఎన్నోసార్లు ఉద్యమాలు జరిగాయి. 60 సంవత్సరాలవరకు సాగిన ఈ ఉద్యమాల్లో ఎందరో వ్యక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కొంతమంది తమ జీవితాన్ని కేవలం ఈ ఉద్యమాలకే అంకితం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం’’ అంటూ ఎందరో యువజవానులు ముందుకు వచ్చారు. అటువంటి వారిలో తనదైన ఒక ప్రత్యేకస్థాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అజన్మ బ్రహ్మచారిగా జీవనం సాగించారు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.
బాల్యం - విద్యాభ్యాం :
1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో నివాసం వుండే లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు జయశంకర్ జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు వున్నారు. వారిలో ఈయన రెండో సంతానం. ఈయన తన కాలేజీ రోజులనుంచే తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఉన్నత చదువులకోసం బెనారస్ వెళ్లి అక్కడ అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్నారు. తరువాత ఓయూలో పీహెచ్ డీని పూర్తి చేశారు.
ఉద్యోగ జీవితం :
పీహెచ్ డీ అయిన అనంతరం 1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తరువాత 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్ గాను, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించి, తన సేవలను అందించారు. అధ్యాపకునిగా వున్న కాలంలో ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ట చిత్తశుద్ధిని ప్రతిఒక్కరిలో నూరిపోసేవారు. ప్రముఖ సాహితీవేత్త అయిన రామశాస్త్రిగారు కూడా ఈయన గురించి చెబుతూ... ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం.. కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థులందరినీ గుర్తుపెట్టుకుని, వారిని వారి పేరుతో పిలవడం కేవలం ఒక్క జయశంకర్ కే సాధ్యం’’ అని కన్నీటిపర్యంతమయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర :
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈయన అందించిన సేవలు మరువరానిది. తన జీవితాన్ని అంకితం చేసి, పెళ్ళి చేసుకోకుండా అజన్మ బ్రహ్మచారిగా నిలిచిపోయారు. 1969వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. అంతకుముందు జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమం, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ వంటి పలురకాల ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. అంతేకాదు... 1954లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనానికి వ్యతిరేకంగా ఫజల్ అలీ కమిషన్ కు విద్యార్థి నాయకుడిగా నివేదికను ఇచ్చారు.
కేవలం తెలంగాణాలోనే కాకుండా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో వెళ్లి... తెలంగాన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఆవశ్యకత గురించి ఎన్నో ప్రసంగాలు చేశారు. దానికి సంబంధించిన పుస్తకాలను కూడా రాసి, ప్రచురించారు. ఆయనను ఎవరు అడిగినా కేవలం ఒకే సమాధానం ఇచ్చేవారు... ‘‘నాకున్న కోరిక ఒకే ఒక్కటి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ చూసిన తరువాతే మరణించాలి’’ అని చెప్పేవారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఈయన వహించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరూ సాహసించలేని సమయంలో 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీవాలి జయశంకర్. అందుకు వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు తెలంగాణ వాణిని వినిపించిన అపరమేధావి కొత్తపల్లి జయశంకర్. ఆయన నిత్యం ఏం చేసినా తెలంగాణకోణంలోనే ఆలోచించి, ఆచరించేవారు. తెలంగాణ డిమాండ్ ను 1969 నుంచి అధ్యయనం చేస్తూ, ప్రతిరోజూ రచనలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఈయన కసీఆర్ తో కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన క్షణం నుంచి కేసీఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా ఆయన వెన్నే వుంటూ వచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిత్యం పోరాడుతూనే వుండాలని నినాదాలు చేసేవారు. తెలంగాణ రాష్ట్ర కళను కళ్లారా చూడాలని ఎప్పటికీ తపించేవారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతోంది, వక్రీకరణలు - వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి), 'తెలంగాణ' (ఆంగ్లంలో) వంటి పుస్తకాలను రచించారు. అయితే చివరగా గొంతు క్యాన్సర్ తో రెండు సంవత్సరాలుగా బాధపడుతూ... 2011 జూన్ 21వ తేదీన మరణించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more