Dr c narayana reddy birthday special article

Dr C Narayana Reddy Birthday Special article, Dr C Narayana Reddy, C Narayana Reddy birthday, Gnanapeeth award Narayana Reddy, Viswambara CNR literary work, CNR Lifetime achievement award, Lyricist C Narayana Reddy, CNR Rajyasabha Nominee, Padma Bhushan Narayana Reddy

Dr C Narayana Reddy Birthday Special article, Dr C Narayana Reddy Birthday Special

అక్షరాల గవాక్షాల నుంచి ఎగిసి వచ్చిన తెలుగు పదాల పెద్దన్న

Posted: 07/29/2013 04:37 PM IST
Dr c narayana reddy birthday special article

మనం పుట్టింది ఎందుకో తెలియాలంటే ఇటువంటి మహనీయుల బాట తెలుసుకోవాలి. సి.నా.రె అనే మూడక్షారాల జ్ఞాన సముదాయంలో తెలుగు,ఉర్దూ, సంస్కృతం అనే మూడు భాషల సంగమముంది. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు మిషల మిశ్రమముంది. అన్నిటిని మించి సిసలైన నానుడి రెట్టించి పలికే జాతీయత ఉంది. విశ్వమనే అద్దంలో నారాయణ ప్రతిఫలం. డా సి. నారాయణ రెడ్డి తెలుగు కీర్తిని, తెలుగు యశస్సును, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని ఏలుబడిగా చేసుకొని తనకు తానుగా జగతి నంతటికీ వ్యాపించిన కవితా తపస్వి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా సి. నారాయణ రెడ్డి. ఆయన నిత్య ప్రగతి శీలి. అభ్యుదయ గామి. ఆ అక్షర దక్షుని జన్మదినాన్ని పురస్కరించుకొని సూర్య ‘అక్షరం’ అక్షరాభివందనాల్ని అందిస్తోంది. కవిగా సినారె హిమాలయమంత ఎత్తు ఎదిగారు. ఓ కవితలో ఆయన ‘హిమాద్రి ఎంత ఎత్తు, హేమాద్రి ఎవరి సొత్తు’ అన్నారు.

Dr C Narayana Reddy Birthday Special

అయితే ఆయన అందని వ్యక్తి కాదు, అందరి మనిషి, మనీషి. సుదీర్ఘ జీవిత గమనంలో సాహితీ జీవన పయనంలో ఎన్నో ఘట్టాలు, ఎన్నో పంథాలు! సంప్రదాయ కవిత్వం నుంచి సంస్కరణ వాద దృక్పథం వైపు మళ్ళిన సినారె, పర భాషా సొగసుల్ని, సోయగాల్ని తనదైన చందంలో అందంగా మలిచి మనందించారు. అవే తెలుగు గజల్స్‌. ఉర్దూ గజల్‌ సంప్రదాయాన్ని తెలుగు వారికి సామాజిక చైతన్య దిశగా అందించిన తెలుగు గజల్‌ సృష్టికర్త సినారె. ప్రాపంచిక సమస్యల్ని, పంచ పాదాలుగా అన్వయిస్తూ ‘ప్రపంచ పదులు’లో ప్రవేశపెట్టిన ఘన కీర్తి సి. నారాయణరెడ్డిది. తన కవితా ప్రయాణంలో ఆయన ఎందరో యువ కవుల్ని తన వెంట నడిపించారు. యువ కవులకు ఆయన తన పరిశోధనా గ్రంథంతో మార్గదర్శిగా నిలిచారు. ఆయన ‘ఆధునికాంధ్ర కవిత్వం’ను పరిశీలించారు, పరిశోధించారు, గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథం నవతరం కవులకు చుక్కానిగా నిలిచింది.

ఇప్పటికీ ఎందరో పరిశోధక విద్యార్థులు తమ సాహితీ పరిశోధనలకు రెఫరెన్స్‌గానే కాక, ప్రామాణికంగా కూడా తీసుకుంటున్నారు. మొదట ఛందోలంకారాలతో పద్య కవిత్వం రాసిన సి. నారాయణ రెడ్డి ఆ తర్వాత గురజాడ పట్ల ఆకర్షితులై వ్యవహారిక భాషలో కవితలు వెలయించడం ప్రారంభించారు. ఆ కవితలు ఆయన యశో చంద్రికలయ్యాయి. సమభావం, నవనాదం ఆయన నినాదం. ఆ తలంపును సి. నారాయణరెడ్డి జీవితంలో కూడా నిరూపించారు. సాధారణంగా కళాకారుల్లో భిన్న వైఖరులుంటాయి. కానీ నారాయణ రెడ్డి అలా కాదు. సమ్యక్‌ పథగామి. తన స్థాయి కవి దాశరథితో కలిసి బాలల కోసం రామాయణ, భారత, భాగవతాలు అలతి అలతి పదాలతో, హృదయంగమంగా రాశారు. ఆయన కవితా దీధితులు ఒక్క ఆంధ్ర దేశానికే పరిమితం కాలేదు. దేశపు ఎల్లలు దాటి ప్రసరించాయి. ప్రపంచ తెలుగు జాతిని కొల్లగొట్టాయి. ఆయన సాహితీ పిసాసి నిత్య సాహితీ కృషీవలుడు. దశాబ్దాలు గడిచినా ఆయన కవితలో వన్నె తగ్గలేదు. వసంతం వీడలేదు. ఆయన ఎన్నో ప్రక్రియల్లో రాశారు. ఎన్నో పదవులు వరించాయి. కానీ తనకు పేరు ప్రతిష్ఠలు కవిత్వం వల్లే వచ్చాయంటారు. ‘కవిత్వం నా ప్రాణం’ అంటారు. అజరామరమైన ఎన్నో కవితలు రాసిన సినారె ఇప్పటికీ అలుపెరుగని కవితా ‘బాట’ సారి. ఒక్క మాటలో చెప్పాలంటే డా సి. నారాయణ రెడ్డి నిలువెత్తు ‘తెలుగు సంతకం’. జ్ఞానపీఠ్‌ అవార్డు పొందిన తరువాత సినారె తన బాధ్యత రెట్టింపు అయినట్టుగా భావించారు.

 Dr C Narayana Reddy

అందుకనేనేమో సమాజంలోని అనేకానేక పార్శాలను సున్నితంగా స్పృశిస్తూ రచనలు చేశారు.ఆదర్శాలకు నోళ్ళు చాలవు/ ఆశయాలకు ఫైళ్ళు చాలవు/ పదపదమంటూ పలుకులే గాని/ కదలని అడుగూ దేనికనీ! పరులకోసం పాటు పడని నరుని బ్రతుకూ దేనికనీ?/ మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగూ దేనికనీ? ప్రతి జన్మా కారణభూతమైతే, కారణ జన్మలే అయితే, పుట్టినందుకు గిట్టే లోపుగా ఎవరికో ఒకరికి మంచి చేయాలనే, సేవ చేయాలనే తపన ఆ రచనల్లో కానవస్తుంది.కరగనిదే క్రొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?/ చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?/ ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా!/ మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది?/ నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?  కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే కాలవ్యయకారులను ఉద్దేశిస్తూ- గాలిలో దీపం పెట్టి నీదే భారం అనే అతి మూర్ఖవాదులను నిరసిస్తూ- కష్టపడాలి- అపుడే ఫలితం పొందగలరు అని ప్రబోధించడం సినారె ధ్యేయం అన్పించింది.

Dr C Narayana Reddy Birthday Special

‘నాగార్జున సాగరం కావ్యం గురించి ప్రస్తావిస్తూ డా పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు- ‘నారాయణరెడ్డిగారి కావ్యము తెనుగునందున్న ఉత్తమ చారిత్రక కావ్యములలో నొకటియని నిస్సందేహముగా చెప్పవచ్చు. ఈ విధముగా వారు చరిత్ర కొనర్చిన సేవ’- పాశ్చాత్య దేశములందు షేక్సుపియరు మొదలగు రచయితల మహాకావ్యములను జ్ఞప్తికి తెచ్చుచున్నది. - ఆనకట్ట వలన నాగార్జున కొండ ముగినిపోవుచున్నదే అని విచార పడనవసరము లేదు. శ్రీ నారాయణ రెడ్డి గారు నాగార్జున కొండకు ఒక శాశ్వత కీర్తి కాయము సృష్టించి యున్నారు. కాదేదీ సినారె కలానికి అనర్హము!’తొలి సినిమా ఎన్‌.టి. రామారావు కథానాయకుడుగా నటించిన గులేబకావళి చిత్రంలో అన్ని పాటలు వ్రాసి అన్ని హిట్‌ సాంగ్స్‌ సాధించిన తెలుగు పదాల పెద్దన్న సినారె. శిశు హృదయానికి కల్లలు లేవు రస రాజ్యానికి ఎల్లలు లేవు లోపలి నలుపు ‘సినారె’కు తెలుసు పైపై తొడుగూ దేనికని?  ధర్మం, సంఘం, దేశం - ఈ మూడింటి త్రివేణీ సంగమం ఎంత మహత్తరమైనదో తెలియజేసిన మూడక్షరాల ముద్దు పేరు సినారె అనబడే డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి తెలుగువిశేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

C Narayana Reddy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles