Kaikala satyanarayana birthday special article

kaikala satyanarayana birthday special article, actor kaikala satyanarayana, Kaikala Satyanarayana Birthday Special, Special Birthday Wishes to Kaikala Satyanarayana,

kaikala satyanarayana birthday special article, Kaikala Satyanarayana Birthday Special Exclusive,

ఎన్టీఆర్ కు డూపు మన కైకాల నటనా సార్వభౌమ.. యముండా

Posted: 07/26/2013 05:47 PM IST
Kaikala satyanarayana birthday special article

తెలుగు తెరపై ఐదు దశాబ్దాలుగా ఆయన కొనసాగిస్తోన్న నటనా ప్రస్థానం ఒక పర్వంలాంటిది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు తెలుగు వారి కళ్లముందు కదలాడతాయి. ఆయన నవరస నటనా సార్వభౌమ.. యముండా.. కైకాల సత్యనారాయణ.. నటశేఖర, కళాప్రపూర్ణ ఇలాంటివి ఆయన్ని వరించాయి. 1935 జూలై 25 న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో జన్మించిన సత్యనారాయణ, 1959 లో వచ్చిన 'సిపాయి కూతురు' చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆయన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయారు ... ప్రతి హృదయంలోను నిలిచిపోయారు. అందమైన విగ్రహం, గంభీరమైన స్వరం, ఏ పాత్రనైనా ఎటువంటి రసాన్నైనా ఏకధాటిగా చేసి మెప్పించగల నటనా సామర్ధ్యం ఆయన సొంత. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రోద్భలంతో వెండితెరకు పరిచయమయిన కైకాల ఎన్టీఆర్ కు డూపుగా ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన నటనా జీవితంలో ఎన్టీఆర్ గారితో అనుభంధమే ఎక్కువ. ఇక ఎస్వీఆర్ తరువాత 'ఘటోత్కచుడు' పాత్రని ధరించి మెప్పించిన ఘనత ఆయన సొంతం. ఒక్కమాటగా చెప్పాలంటే ఇటు పౌరాణికాల్లోనూ, అటు సాంఘికాల్లోను ఎన్టీఆర్ కి సమవుజ్జీగా నిలిచిన ప్రతి నాయకుడుగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఇక యముడు అంటే ఇప్పటి ప్రేక్షక జనానికి ముందుగా గుర్తొచ్చేది కైకాలే. యముండా అంటూ ఆయన గర్జిస్తే ధియేటర్ లు దద్దరిల్లేవి.

 

ఒక్కమాటగా చెప్పాలంటే ఆయన యమధర్మ రాజు పాత్రలో ఆయన నటనా విన్యాసమే చేశారు. కైకలా సత్యనారాయణ యముడుగా నటించిన 'యమగోల', 'యముడికిమొగుడు', 'యమలీల' వంటి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయంటే అందుకు యమధర్మరాజుగా యమహో గర్జనే కారణంగా చెప్పొచ్చు. సుధీర్గమైన ఈ నట ప్రస్థానంలో 200 కి పైగా చిత్రాలో నటించిన ఆయన, నిర్మాతగా కూడా సక్సెస్ ని సాధించారు. ఓ వైపున నటుడిగా కొనసాగుతూనే మరో వైపున రాజకీయాల్లో ప్రవేశించి మచిలీపట్నం నుండి లోక్ సభకు పోటీ చేసి గెలుపొంది తనదైన రీతిలో సేవలను అందించారునటనలో కైకాల సాధించిన ఘనతకుగాను ఆయనకు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, ప్రతి కథానాయకుడిగా, సహాయ నటుడిగాను ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందులతోనూ గౌరవించింది. ఇంకా నేషనల్ అవార్డులతో పాటు పలు కళా సంఘాలు కూడా అయనకు ఎన్నో అవార్డులతో సత్కరించారు. ఇలా కైకాల నవరస నటనా ప్రయాణం కొనసాగుతూనే ఉండాలని మనం కోరుకుంద్దాం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles