బంగారుబొమ్మలా మెరిసే మంజులా తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పుడంటే ఎందరో గ్లామర్ హీరోయిన్లు ఉన్నారు గానీ... మంజుల వచ్చే నాటికి ఎవరూ లేరు. అందుకే ఈమె గ్లామర్ కథానాయికగా ముద్ర వేసుకుంది. గ్లామర్ కే కాదు.. ఆమెకిచ్చిన పాత్రలోనూ ఇట్టే ఒదిగిపోయేది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా? అన్నట్లు ఉండేది ఆమె నటన. అందమెన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1953, సెప్టెంబర్ 9న మంజుల జన్మించారు. చెన్నయ్‌లోనే పుట్టి పెరిగిన మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు. 1965లో ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కాదల్ మన్నన్ జెమినీ గణేశన్ చిన్నప్పటి పాత్రలో నటించి, తొలి చూపులో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఎంజీఆర్ నటించిన ‘రిక్షాకారన్’తో హీరోయిన్గాపరిచయమ య్యారు.తెలుగులో మంజుల ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది ‘మాయదారి మల్లిగాడు’. హీరోయిన్గా ఆమెకు అది తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. తరువాత ‘ఉలగం సుట్రుం వాలిబన్’ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. 1970ల్లో మంజుల హీరోయిన్గా అగ్రస్థాయికి చేరుకున్నారు.
అయితే 80వ దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్‌కుమార్,కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులతో కలిసి నటించారామె. గిన్నిస్ రికార్డు చిత్రం ‘స్వయంవరం’లోనూ ఆమె నటించారు. ‘ఉన్నిడం మయంగురేన్’ చిత్రీకరణలో సమయంలో విజయ్‌కుమార్, మంజుల ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొంతకాలానికే వివాహం చే సుకున్నారు. ఎంజీఆర్ దగ్గరుండి వివాహం జరిపించారు.తెలుగులో తొలిసారిగా మంజుల నటించిన చిత్రం ‘జైజవాన్’(1970). ఏయన్నార్, భారతి జంటగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం ‘వాడే వీడు’. ఆ తరువాత ‘చాణక్య-చంద్రగుప్త’ ‘పల్లెటూరి చిన్నోడు’, ‘మనుషులంతా ఒక్కటే’, ‘మగాడు’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘మా ఇద్దరి కథ’ చిత్రాల్లో నటించారు. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సినిమా పేర్లతో తయారైన ‘నిన్నే పెళ్లాడతా.. రాముడు..భీముడు’ పాట ప్రతి ఒక్కరినీ అలరించింది. అలాగే ఏయన్నార్ సరసన ‘దొరబాబు’, ‘బంగారు బొమ్మలు’, ‘మహాకవి క్షేత్రయ్య’ చిత్రాల్లో నటించారు. వీటిల్లో ‘బంగారు బొమ్మలు’ చిత్రం షూటింగ్ విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగింది. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలెండ్‌లో సెట్ వేసి ‘నేనీ దరిని నువ్వా దరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పాట చిత్రీకరించారు. ‘మాయదారి మల్లిగాడు’ తరువాత కృష్ణతో ‘రక్తసంబంధాలు’, ‘దేవుడిలాంటి మనిషి’, ‘భలే దొంగలు’, ‘మనుషులు చేసిన దొంగలు’ చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణ కెరీర్లో శిఖరాగ్రాన నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’లోనూ మంజుల నటించారు. అయితే కృష్ణ సరసన కాకుండా చంద్రమోహన్ పక్కన గిరిజన యువతి రత్తి పాత్రను ఆమె పోషించి మెప్పించారు.
విజయకుమార్‌తో పెళ్లి జరిగిన తరువాత సినిమాలకు దూరమ య్యారు మంజుల. వీరి ముగ్గురు అమ్మాయిలు శ్రీదేవి, రుక్మిణి తెలుగు సినిమాలలో నటించారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘చిక్కడు-దొరకడు’ సినిమాతో తిరిగి క్యారెక్టర్ నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ సిని మా తరువాత డాక్టర్ రామానాయుడు నిర్మించిన ‘ప్రేమ’ చిత్రంలో రేవతికి తల్లిగా నటించారు. తెలుగులో ఈమె చివరి చిత్రం వాసు. వెంకటేష్ తల్లిగా ఆమె నటించారు. 2011లో తమిళం లో వచ్చిన ‘ఎన్ ఉల్లమ్ తేడుదే’. 23 జూలై 2013 మంగళవారం, చెన్నై లో కన్ను మూశారు. తెలుగులో మిగిలిన హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించినా శోభన్‌బాబు, మంజుల జంట మాత్రమే హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జగపతి అధినేత వి.బి. రాజేందప్రస్రాద్ నిర్మించిన ‘మంచి మనుషులు’ చిత్రంలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. సిమ్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ కోసం శోభన్‌బాబు, మంజుల ప్రత్యేకంగా స్కేటింగ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. మరుసటి ఏడాది వచ్చిన ‘అందరూ మంచివారే’, ‘గుణవంతుడు’, ‘పిచ్చిమారాజు’ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టి, వీరి కాంబినేషన్‌కి క్రేజ్ ఏర్పరచాయి. ఆ తరువాత ‘ఇద్దరూ ఇద్దరే’, ‘మొనగాడు’, ‘గడుసుపిల్లోడు’ చిత్రాల్లో కూడా వీరిద్దరు నటించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more