Tamil actor director manivannan dead

Renowned Tamil actor, director Manivannan died in Chennai, Popular Tamil actor, writer and director R. Manivannan, Tamil director, actor-director, Manivanan death

tamil Actor-director Manivannan dead

గొప్ప నటుడు మణివణ్ణన్

Posted: 06/15/2013 06:11 PM IST
Tamil actor director manivannan dead

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మణివణ్ణన్ ఇక లేరు. 59 ఏళ్ల మణివన్నన్ శనివారం గుండెపోటుతో మరణించారు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటుడిగా, 50కిపైగా చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన మణివన్నన్ సీనియర్ తమిళ సినీ ప్రముఖుల్లో ఒకరు. మణివణ్ణన్ కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగు, మళయాలం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.

1954లో కోయంబత్తూరు జిల్లా సులూర్ లో జన్మించి ఆర్.మణివణ్ణన్ చెన్నై నెసపక్కంలోని తన నివాసంలో ఈరోజు (15.06.2013) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య సెంగమలం, కుమారుడు రఘువరన్, కుమార్తె జ్యోతి ఉన్నారు. పుదుమనితన్, చిన్నతంబి పెరియా తంబి, పల్లికట్టు వంటి గొప్ప తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తొలుత మాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నటుడు, దర్శకుడుగా మారారు.తెలుగులో నాగబాబు హీరోగా నటించిన అగ్రిమెంట్, కార్తీక్, రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ నటించిన గోపాలరావుగారి అబ్బాయి, సుమన్, విజయశాంతి నటించిన దర్జాదొంగ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు.

తెలుగులో కుబుసం చిత్రంలో ఆయన నటించారు. మోహన్, నళిని, విజయకాంత్ నటించిన నూరవ రోజు, భానుచందర్, అహల్య నటించిన ఖూనీ, సత్యరాజ్,రాధ నటించిన ఖైది నెం.79 చిత్రాలకు కూడా ఆయన దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషలలో దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ఆయన ఎక్కువ సినిమాలలో హీరోలకు తండ్రిగా, మామగా నటించారు. తండ్రిగా ఆయన నటన అమోఘం. పలు చిత్రాలలో తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని తన నటన ద్వారా చాలా అద్బుతంగా ప్రదర్శించారు. తెలుగు డబ్బింగ్ చిత్రాలు ఒకేఒక్కడు, ప్రేమికులరోజు, రిథం, నరసింహ, శివాజి, భామనే సత్యభామనే చిత్రాల్లో మణివణ్ణన్ నటనను మనం మరచిపోలేం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటతడిపెట్టిస్తారు. ఒకేఒక్కడు, ప్రేమికులరోజు చిత్రాలలో ఆయన నటన చూడవలసిందే. మణివన్నన్ మరణవార్తతో కోలీవుడ్ మొత్తం విషాదంలో మునిగి పోయింది. నటులు సిద్ధార్థ, ప్రియమణి, దర్శకుడు సుందర్ సి తదితరులు ట్విట్టర్లో తమ సంతాపం వ్యక్తం చేసారు. మణివణ్ణన్ మరణ వార్త ఇటు పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా కలిచి వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles