Special article ex prime minister pv narasimha rao jayanthi

Ex prime Minister PV Narasimha Rao Jayanthi, Ex prime Minister PV Narasimha Rao 92 Jayanthi, congress party, political leader, pv narasimha rao and manmohan singh, sonia gandhi, rajivgandhi, andhrapradesh first prime miniser pv narasimha rao,

Ex prime Minister PV Narasimha Rao Jayanthi

పివి నరసింహరావు 92 జయంతి....

Posted: 06/28/2013 06:24 PM IST
Special article ex prime minister pv narasimha rao jayanthi

దివంగత మాజీ ప్రధాని పివి.నరసింహరావుకు ఈ రోజు పివి.నరసింహరావు 92వ జయంతి ఉత్సావాలు జరుపుకుంటూ రాష్ట్ర మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులు ఆర్పించారు. పి.వి. నరసింహారావు కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, సాహిత్య సాంస్కృతిక రంగాలపై పండితులకు, మేధావులకు సరిదీటుగా నిలబడి వ్యాఖ్యానించగల దిట్ట. సామాజిక మర్మమెరిగిన జ్ఞాని. బహుభాషావేత్త. అన్ని రంగాల్లోనూ ప్రజ్ఞాపాటవాలు, ప్రపంచ మనుగడపై, దాని పోకడలపై అవగాహన కలిగిన పి.వి. నరసింహారావుకు ఆప్తులు చాలా మందే ఉన్నారు. పౌరహక్కుల కోసం నిరంతరం గొంతునిస్తూ వచ్చిన ప్రజాకవి కాళోజీ పి.వి. నరసింహారావును తనవాడిగా స్వీకరించగలిగినవారు. పి.వి. నరసింహారావు అధికారం కోల్పోయి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తర్వాత ఆయన పక్కన నించున్నవారు ఎవరూ ఆయన నుంచి ఏమీ ఆశించినవారు కారు. పైగా వారందరూ తమ తమ జీవనయానాలలో, తమ తమ జీవిత విధానాల పట్ల నిర్దిష్టమైన దృక్పథం కలిగినవారే.

వారు పి.వి. నరసింహారావును అభిమానించారంటే ఆయన విధానాలను పూర్తిగా అంగీకరిస్తున్నారని, ఎవరి వ్యక్తిత్వాలను వారు కాపాడుకుంటూనే స్నేహానికి, సాన్నిహిత్యానికి ఒక అర్థం చెప్పినవారు. ఈ సభలో పి.వి. నరసింహారావు ఆబ్జెక్టివ్‌గా చాలా వ్యాఖ్యలు చేశారు. దేశంలో యుద్ధ పరిస్థితులున్నాయని, ఇందుకు ప్రజలు సంసిద్ధం కావాలని ఆయన అన్నారు. 1962 చైనాతో జరిగిన యుద్ధం తర్వాత మన రక్షణ రంగాన్ని ఆధునీకరించుకున్నామని, ఆనాటి పరిస్థితులే నేడున్నాయని ఆయన అన్నారు. 1991లో దూరాలోచన చేసినందు వల్లనే మనం ఆర్థిక గడ్డు పరిస్థితులను అధిగమించగలిగామని ఆయన చెప్పారు. ఎంతో కాలం చట్టసభల్లో ఉన్న పి.వి. నరసింహారావు దేశానికి సంబంధించిన ఏ పరిణామాన్నయినా అధికారయుతంగా విశ్లేషింగలిగేవారు. ఆ రోజు ఆయన దాదాపు అరగంట సేపు దేశరాజకీయ పరిణామాలను సంక్షిప్తంగా రూపుకట్టి ప్రేక్షకుల ముందుంచారు.

pv narasimha rao 

దేశంలో ఆర్థిక సంస్కరణలకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలోనే పాదులు పడినప్పటికీ దానికి ఒక ఊపును, వేగాన్ని ఇచ్చిన, ఒక దిశను నిర్దేశించినవారు పి.వి. నరసింహారావు. ప్రస్తుత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసిన ఆర్థిక సంస్కరణలకు నిర్దిష్ట రూపాన్ని, గమనాన్ని నిర్దేశించారు. ఈ సంస్కరణలను వామపక్ష మేధావులు, రాజకీయ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. అయితే పి.వి. నరసింహారావు అధికారం నుంచి తప్పుకున్న తర్వాత, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యానించలేదు. ఎవరి గురించీ నోరెత్తి పల్లెత్తు మాటా అనలేదు. తనపై తప్పుడు కేసులు పెట్టారనో, రాజకీయ కక్ష సాధిస్తున్నారో అని ఆయన మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా నోరు పారేసుకోలేదు. అదంతా ఒక వెలుగులోకి వస్తే గానీ ఆయన వ్యక్తిత్వమేమిటో, ఆయన దృక్పథమేమిటో పేదల పక్షాన, గ్రామీణుల పక్షాన ఆయన ఎలా నిలబడ్డారో పూర్తిగా అర్థం కాదు. పి.వి. నరసింహారావు వ్యక్తిత్వం బహుముఖీనమైంది. ఇదంతా ఇలా ఉంటే, మన దేశానికి ఏం కావాలో బాగా ఎరిగినవాడు ఆయన.

గ్రామీణ ప్రాంతాల్లోని మెరికల్లాంటి కుర్రాళ్లను ఆయన దేశానికి నాయకత్వం వహించే యోధులుగా బహుశా ఆయన తీర్చి దిద్దాలని అనుకొని ఉంటారు లేదా మట్టిలో మాణిక్యాలను వెలికితీసే అవకాశాలు కల్పించాలనైనా అనుకొని ఉంటారు. గురుకుల పాఠశాలలకు ఆయన శ్రీకారం చుట్టడాన్ని బట్టే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాలల్లో చేరిన ఎంతో మంది గ్రామీణులు ఇవాళ్ల ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. ఇలా ఆయన చాలా వాటికి ఆద్యుడు. ఈ విషయాలేవీ బయట ప్రపంచానికి తెలియవు. అలా తెలియజెప్పే యంత్రాంగమేదీ పివికి ఉన్నట్లు లేదు. ఆయన సన్నిహితులకు ఆ ధ్యాస ఉన్నట్లు లేదు. భూసంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనే. కేవలం రాజకీయ మనుగడ కోసమో, మరేదానికో ఆయన సంస్కరణలు చేపట్టలేదు. దానికి ప్రేరణ వేరే కావచ్చు.

pvnr

అది ఇక్కడ అప్రస్తుతం. తన సొంత గ్రామంలోని వంగరలో తన కుటుంబానికి భూపరిమితి చట్టానికి మించి భూములను అన్నింటినీ ఆయన పంచి పెట్టారు. ఇప్పటికీ ఆయన భూములను గ్రామంలోనివారే సేద్యం చేసుకుంటారు. దాని నుంచి ఆయన ఏనాడూ ప్రతిఫలం ఆశించలేదు. జీవితం పట్ల సరైన దృక్పథం గలవారే పివి లాగా ఉండగలరు. అంతర్ముఖీనత్వం పి.వి. నరసింహారావుకు అందుకే సంతరించి ఉంటుంది. దేశానికి ఏం కావాలో ఎరిగినవాడు ఆయన. అందుకు ఏం చేయాలో తెలిసినవాడు. తెలంగాణలోని మేధావుల వ్యక్తిత్వానికి, నిస్సహాయతకు పి.వి. నరసింహారావు ఒక నిలువెత్తు అద్దం. ఆర్యసామాజికుడైన పి.వి. ఈ వ్యవస్థ మెరుగు పడడానికి కావలసిన దారేదో తెలిసినవాడు. ఈ దేశ రాజకీయాలు పేదల, గ్రామీణుల పక్షాన నడవకపోవడానికి కారణమేమిటో, తన లాంటి కొంత మంది రాజకీయ పద్మవ్యూహంలో నిస్సహాయులైన అభిమానుల్లా దెబ్బ తింటారో తెలియడం అవసరమని ఆయన భావన కావచ్చు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles