S p balasubramaniam birthday special

s p balasubramaniam, s p balasubramaniam birthday, sp balasubramaniam, happy birthday! special songs, balu hit songs, balu birthday special, balu birthday celebration

s p balasubramaniam birthday special

స్వరమాంత్రికుడు

Posted: 06/04/2013 01:38 PM IST
S p balasubramaniam birthday special

పాడటం ఓ కళ.. అందులోనూ సినిమాకి పాడటం ప్రత్యేక కళ.. తెర మీద ద్రుశ్యం తెర వెనుక కంఠం పాలూ, పంచదారలై కరిగి కలిసిపోవాలి. ఆ రెండింటిని విడదీయలేని అనుభూతి అవిష్క్కతం కావాలి. ఇంపు, సొంపు స్పష్టతా, స్వచ్చతా గొంతులో గుడి కట్టాలి. అందుకే బాలూ గొంతు 46 ఏళ్లుగా తెలుగు సినిమా పాటకు పర్యాయపదమైపోయింది. ఈ రోజు బాలసుబ్రమణ్యం పుట్టిన రోజు. ఆయన పాటల్ని వింటుంటే మన నోటి నుంచి అప్రయత్నంగా అద్బుత అనే మాట వస్తుంది. దశాబ్దాల పాటు తన పాటలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న బాలసుబ్రమణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. 1946 జూన్‌ 4వ తేదీన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మ పేటలో జన్మించారు.

చిన్నతనం నుంచే పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్న బాలు మొదటి పాట ఏమి ఈ వింత మోహం'ని 22 ఏళ్ళ వయస్సులో ''శ్రీ శ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రం కోసం పాడారు. ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో 1966 డిసెంబర్‌ 15న మద్రాసులోని విజయా గార్డెన్స్‌ రికార్డింగ్‌ థియేటరో ఆ పాటని రికార్డు చేశారు.ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ, హిందీ, బెంగాళి భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు, పాడుతూనే ఉన్నారు. అంతేగాక సంగీత దర్శకుడిగానూ 55 చిత్రాలకు పని చేసి మధురమైన సంగీ తాన్ని అందించారు. ఇక నటుడుగా 'మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌' చిత్రంతో తెరంగ్రేటం చేసి ఇప్పటి వరకూ దాదాపు 70 సినిమాల్లో నటించారు.

తాజాగా ఇటీవలే కళాతపస్వి కె.విశ్వనాథ్‌, గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రధారులుగా వచ్చిన దేవస్థానం చిత్రంలోని బాలు నటన పలువురి ప్రశంసలందుకోంది.తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా,నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖి ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసు బ్రహ్మణ్యం. మరోసారి ఈ గానగం ధర్వుడికి పుట్టిన రోజు సందర్భంగా తెలుగువిశేష్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles