Navjot Singh Sidhu To Resign From Congress Party.? కాంగ్రెస్ పార్టీకి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా.?

Navjot singh sidhu to resign from congress party

punjab, punjab assembly elections 2022, punjab assembly election results, AAP, congress, navjot singh sidhu, sidhu resigns, Navjot Singh Sidhu, Sonia Gandhi, Punjab Congress President, Resignation, Amirender singh, Charanjit singh Chenni, Punjab, Politics

After Congress President Sonia Gandhi asked the PCC chief of all five states to quit from their posts after the party's humiliating defeat in the election, Navjot Singh Sidhu, the state in-charge of Punjab for the party has tendered his resignation. Rumours doing rounds in Political circles that the former cricketer also in a mood to quit Congress party.

కాంగ్రెస్ పార్టీకి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా.?

Posted: 03/18/2022 11:30 AM IST
Navjot singh sidhu to resign from congress party

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా మారిందని గోచరించింది. దీంతో కాంగ్రెస్‌కు  ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్‌ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టే వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయినా ఇది కాంగ్రెస్‌కు సత్ఫలితాలను ఇవ్వలేదు. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్‌కే పట్టం కట్టారు.

పంజాబ్‌ సీఎం పీఠం నుంచి అమరీందర్‌ సింగ్‌ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఆశించే పంజాబ్‌ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం చన్నీని ముఖ్యమంత్రి చేసింది. ఇది కూడా సిద్ధూకి జీర్ణించలేదు. పార్టీ మారదామనే ప్లాన్‌ చేశాడు. మొత్తం కాంగ్రెస్‌నే విచ్ఛిన్నం చేద్దామనే అనుకున్నాడు. తనకు దక్కనిది వేరే వాళ్ల దక్కడంతో వివాదాలకు ఆజ్యం పోశాడు. కానీ చివరకు రాహుల్‌ గాంధీ జోక్యంతో సిద్ధూ వెనక్కి తగ్గి కాంగ్రెస్‌తో నడిచాడు.

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టానం ప్రకటించినా సిద్ధూ మిన్నుకుండిపోయాడు. సీఎం క్యాండిడేట్‌ తనకు ప్రాబ్లమ్‌ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. ఇక తాజాగా అప్ అధికారంలోకి వెళ్లిన పంజాబ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణస్వీకారం చేయడంతో.. ఆయన తన మనస్సులోని మాటలను బయటపెట్టాడు. ఇక నుంచి అప్ నేతృత్వంలో యాంటీ మాఫియా రాజ్ పంజాబ్ లో అవిష్కృతం అవుతుందని ఆయన కాంగ్రెస్ కు చురకలంటించే పని చేశారు. ఈ క్రమంలో తాను అప్ లోకి వెళ్లే యోచనలో ఆయన వున్నారని సమాచారం. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి ఇప్పుడు రాజీనామా డ్రామాకు తెరలేపడం మళ్లీ హాట్‌టాపిక్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles