possible change of guard in Lok Sabha for congress మనీష్ తివారీ.. శశిథరూర్.. లోక్ సభ పక్ష నేత ఎవరు...?

Congress in denial as power corridors abuzz with possible change of guard in lok sabha

lok sabha, leader of opposition, rahul gandhi, sonia gandhi, manish tewari, shashi tharoor, adhir ranjan chowdhury, mamata banerjee, national politics

The Congress party appears to be warming up to the Trinamool Congress ahead of the Monsoon Session of Parliament, with power circles abuzz with a possible change of guard in the Lok Sabha. It has been reported that the party may replace incumbent Adhir Ranjan Chowdhury with Shashi Tharoor

లోక్ సభ పక్ష నేత మార్పుకు సిద్దమవుతున్న కాంగ్రెస్.?

Posted: 07/12/2021 09:52 PM IST
Congress in denial as power corridors abuzz with possible change of guard in lok sabha

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడిందా.? అంటే ఔనన సమాధానాలే వినబడుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్నింటా తనదైన మార్కు వేసుకుని సన్నధం కావాలని హైకమాండ్ యోచనలో వుందని తెలుస్తోంది. ఓ వైపు కేంద్రంలోని ఎన్డేయేకు అమలు పరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనలు, ధర్నాలతో ఓ వైపు కార్యకర్తల్లోనూ నూతనోత్తేజం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ కమిటీ్లోనూ సమగ్ర మార్పులు చేస్తోంది.  

ఇక తాజాగా ఆ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ లోక్ సభాపక్ష నేతను మార్చే యోచనలో ఉంది. ప్రస్తుతం ఈ బాధ్యతను సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో శశి థరూర్ ని కానీ, మరో సీనియర్ నేత మనీశ్ తివారీని కాని నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం.  అధిర్ రంజన్ చౌధురి పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే, ఇటీవల బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. దీంతో, అధిర్ ను పదవులను నుంచి తొలగించాలని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే, మమత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆమెకు అధిర్ వ్యతిరేకమే. మమత సొంత పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన అదే ధోరణిని అవలంబిస్తూ వస్తున్నారు. అధిర్ తీరు వల్ల జాతీయ స్థాయిలో మమతతో కలిసి బీజేపీపై పోరాటం చేయడానికి కూడా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయనను తొలగించేందుకు పార్టీ హైకమాండ్ అడుగులు వేస్తున్నట్టు చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lok sabha  leader of opposition  rahul gandhi  sonia gandhi  manish tewari  shashi tharoor  

Other Articles