Distribution of counterfeit notes in municipal elections.? ఏపీ పురపాలక ఎన్నికల్లో నకిలీ నోట్లు.?

Why are rs 7 9 counterfeit currency notes being brought to visakhapatnam

counterfeit notes, odisha, raipur, chhattisgarh, Sunki check-post, Municipal Elections, AP Municipal Voters, Visakhapatnam, Koraput, Odisha-Andhra Pradesh border, Varun Guntupalli, SP koraput, Andhra Pradesh Municipal Elections, Andhra Pradesh, Politics, Crime

Counterfeit notes with a face value of ₹7.90 crore were seized from a car in Odisha’s Koraput district on the Odisha-Andhra Pradesh border on 3rd March. This raises doubts that these notes are being used in the AP Muncipal elections and being distributed to the voters. three persons arrested. During regular vehicle checking at the Sunki post on our border, we found four trolley bags from a hatchback car bearing Chhattisgarh number.

ఏపీ పురపాలక ఎన్నికల్లో నకిలీ నోట్లు.?

Posted: 03/09/2021 03:32 PM IST
Why are rs 7 9 counterfeit currency notes being brought to visakhapatnam

ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు, కార్పోరేషన్లకు జరుగుతున్న ఎన్నికలలో అభ్యర్థులు ప్రచార అంకానికి, రెండో విడత పంపీణీ అంకానికి కూడా ముగింపు పడిన నేపథ్యంలో ఇక అసలైన తుది అంకానికి మరికొన్ని గంట్లలో తెరలేవనుంది. ఈ క్రమంలో ఓటు కోసం నోటు పంచిన కొందరు నేతలు.. ప్రజలను బురడీ కోట్టించేందుకు ఏకంగా నకిలీ నోట్లను పంఫిణీ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజలను నోట్లు ఇచ్చైనా సరే ఎన్నికలలో ప్రత్యర్థులపై గెలుపొందాలన్న దృఢసంకల్పంతో వున్న కొందరు నేతలు పట్టుదలకు పోయి.. ఓటర్లకు ఓటుకు అడిగినంతా ఇస్తూన్నారని తెలుస్తోంది.

అయితే అంతగా బడ్జెట్ లేకపోవడంతో వీరు.. డబ్బు లేదు అంటే చులకన అవుతామని.. ఇప్పటి వరకు వెచ్చించిన డబ్బు కూడా తమకు దక్కదని, విజయం సాధించడం ద్వారానే తాము ఖర్చెపెట్టిన దాన్ని వడ్డీతో సహా రాబట్టుకోవచ్చునని భావించి.. ఓటర్లకు నకిలీ నోట్లను పంఫిణీ చేశారని తెలిసింది. ఇందుకోసం మంచి పథకం వేసి.. పరాయి రాష్ట్రంలో కోట్ల రూపాయల నకిలీ నోట్లను తయారు చేయించి వాటిని రాష్ట్రంలోకి తరలిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో మున్సిఫల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అభ్యర్థులు ఓ వైపు ఓటర్ల మద్దతు కోరుతూనే.. మరోవైపు నకిలీ నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులకు ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.7.90 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వస్తున్న ఓ కారులో ముగ్గురు యువకులు వస్తున్నారని గమనించిన పోలీసులు.. అనుమానాస్పందంగా వ్వవహరించిన తీరుతో.. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా.? అన్న సందేహంతో తనిఖీలు చేశారు. కాగా కారు డిక్కీలో నాలుగు ట్రాలీ బ్యాగుల నిండా కళ్లు చెదిరే కరెన్సీ కట్టలు కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని విచారించారు.

ఒడిశాలోని రాయ్ పూర్ కలర్ జిరాక్స్ తీసి తయారు చేసిన ఈ నకిలీ నోట్లను అనేక చెక్ పోస్టులు దాటించి చివరకు చిట్టచివరిదైన సుంకీ చెక్ పోస్టు వద్ద పోలీసులను బొల్తా కొట్టించబోయి వీరే పోలీసులకు అడ్డంగా చిక్కారు. ఈ ఘటనే పలు అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నానికి అంత అర్జెంటుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏనమిది కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను తీసుకురావడానికి గత కారణమేంటి.? అంటే ఈ నకిలీ నోట్లతో పురపాలక సంఘం ఎన్నికలలో వినియోగించడానికేనా.? అయితే వీటిని తెప్పించిన నేతలు ఏ పార్టీకి చెందినవారై వుంటారు.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఇక పురపాలక సంఘాల పోరుతో పాటు కార్పోరేషన్ ఎన్నికలకు, నగర పంచాయితీలకు గత నెల 15న రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడగా, గత ఏడాది మార్చి 14న అభ్యర్థుల నామినేషన్ పక్రియ ముగిసింది. దీంతో అక్కడి నుంచే తదుపరి ప్రాసెస్ ను ప్రారంభించే క్రమంలో ఇక నామినేషన్ల ఉపసంహరణ, స్ర్కూటినీ తదితరాలకు నోటిఫికేషన్ గత నెల 15న ఈసీ విడుదల చేసింది. అయితే కోరాన కష్టకాలంలో పరిస్థితులు తారుమారైన అభ్యర్థులు ఇలా చేశారో.. లేక ముందునుంచే ఈ పథకాన్ని రచించి ఇలా చేశారో తెలియదు కానీ ఏకంగా రూ.7.90 కోట్ల నకిలీ కరెన్సీని విశాఖకు తరలిస్తూ పోలీసులకు చిక్కారు.

ఇక ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. పోలీసులకు చిక్కకుండా విశాఖపట్నానికి ఎన్ని కోట్ల కరెన్సీ నోట్లు వచ్చి చేరాయో..? వాటిని ఇప్పటికే అభ్యర్థుల తరపున ఓటర్లకు కూడా పంపిణీ చేశారనన్న వార్తలు కూడా అందతున్నాయి. ఇది ఏ పార్టీ అభ్యర్థి చేశారన్న విషయాన్ని పక్కనబెడితే.. ఇంతలా కలర్ జిరాక్స్ తీసిన నోట్లను ఒక్కరు తమ వార్డులలో పంచేందుకు వినియోగించి వుండరనీ.. ఇలా ఏదో ఒక పార్టీకే సంబంధం వుండి వుంటుందన్న అరోపణలు కూడా వినబడతున్నాయి. ప్రపంచం గర్వించే ప్రజాస్వామ దేశాలలో పెద్దదైన భారతావనిలో ఓటును నోటుకు అమ్మకూడదని, అమ్మితే.. చేతికందేది నకిలీ కరెన్సీ నోటేనని కూడా పలువురు మేధావులు సూచిస్తున్నారు.

ఇది నిజంగా పార్టీల పనే అయితే ఇలాంటి ఎన్ని వందల కోట్ల నోట్లు పోలీసులకు చిక్కకుండా రాష్ట్రంలోకి వచ్చి వుంటాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్లకు ఈ నకిలీ నోట్లనే తరలించి.. వీటినే ఓటర్లకు పంపిణీ చేశారా అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పొరుగునున్న రాష్ట్రాలలో ఈ తరహా నోట్లును తయారు చేయించి వాటిని రాష్ట్రంలోని పురపాలక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు తరలించారా.? అంటే ప్రస్తుత ఎన్నికల వేళ.. రాష్ట్ర ఓటరుకు అందుతున్నది నకిలీ కరెన్సీ నోటేనా అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles