why YCP ativists obstruct oppositions from contesting elections బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

Why ruling party activists obstruct oppositions from contesting elections

polling officials deny to give nomination papers to oppositions, nomination papers, ruling party activist ruckus, ruling party hurdles, ysrcp activists attack oppositions, local body elections, zptc elections, mptc elections, panchayat elections, YSRCP, BJP, TDP, opposition parties, Andhra pradesh, Politics

If people of Andhra Pradesh support Ruling party, then why the activists of YSRCP creating hurdles and obstructing opposition candidates from contesting elections

బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

Posted: 03/11/2020 08:57 PM IST
Why ruling party activists obstruct oppositions from contesting elections

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార పార్టీ కార్యకర్తలు అడ్డంకులకు ప్రహసనంలా మారింది. ఇందుగలదు అందు లేదన్న సందేహం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అలుముకుంది. ఎన్నికలు అంటేనే కేవలం అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులకు ఈ ఎన్నికలలో పాల్గోనే అవకాశం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఇక ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి, లేక నామినేషన్ పత్రాలను తీసుకెళ్లేందుకు వస్తున్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. వారి చేతుల్లోంచి పత్రాలను లాక్కుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో తమది అధికార పార్టీ అని.. అధికారానికి జులుం వుంటుందన్నట్లు వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్ర అమాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులే అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు.

పలుచోట్ల అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాడులు చేసి ఆ ఛాయలకే రాకుండా తరుముతున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్‌ పత్రాలను తీసుకున్నారెందుకు అని అడిగిన ప్రజాబలమున్న స్థానిక నేతలపై తిరగబడకుండా.. ఎన్నికలకు అస్కారం లేకుండా ఏకగ్రీవంగా నిర్వహించేందుకుకని బుకాయిస్తున్నారు. బలవంతులు కానీ నేతలకు.. ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని హుకుం జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని నిన్న ఒక్కరోజు జరిగిన దాడులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు నేతలు ఎన్నికలలో పాల్గోనేందుకు జంకుతున్నారు.

ఇక ఇదిచాలదన్నట్లు అధికార పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయకుండా మరోలా అడ్డుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు అధికారులతో పాటు పోలీసు యంత్రాగాన్ని కూడా విరివిగా వాడుకుంటున్నారు. టీడీపీ సహా జనసేన, బీజేపి, వామపక్షాలకు చెందిన నేతలకు సంబంధించిన పాత కేసులను కూడా పోలీసులతో తిరగతోడేస్తున్నారు. ఇక మరికోందరు నేతలు ప్రత్యేర్థి పార్టీల నేతలు ఇంటి పన్ను బకాయిలు. విద్యుత్ బిల్లులు సహా ఇతర పెండింగులో వున్న బిల్లులను చెల్లించేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక మరికోందరికి అధికారులు అసలు నామినేషన్ పత్రాలనే ఇవ్వకుండా పలుమార్లు తప్పించుకుంటున్నారు.

అధికార పార్టీ నవరత్నాలను అమల్లోకి తీసుకురావడం.. వాటిని ప్రజలకు అందించడం.. ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నా ప్రజలకిచ్చిన మాట కోసం అధికార పార్టీ సుదీర్ఘ లక్ష్యాలను.. బహుముఖ ప్రయోజన ప్రాజెక్టులను కూడా పక్కనబెట్టి నవరత్నాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలోని అబాలగోపాలానికి ఆయన ఓ దైవంలా కనిపిస్తున్నాడు. కోరకుండానే వరాలనొసగే దేవుడని కీర్తిస్తున్నారు. ఇలా రాష్ట్రప్రజలు ఆయనను ముఖ్యమంత్రిని వేనోళ్ల పోడగడం ఇంతకుముందు స్వర్గీయ ఎన్టీరామారావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డీలకు మాత్రమే దక్కింది.

తన తండ్రి వైఎస్ హయాంలో ప్రజలు ఒకింత రామరాజ్యాన్ని చవిచూశారు. అద్దాలమేడలుగా కనిపించే కార్పోరేట్ అసుపత్రుల ఎదుట నిలబడి చూడటానికి కూడా సాహసించని పేదలు.. ఇప్పుడదే అసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు, ఇంజనీరింగ్, డాక్టర్, ఫార్మసిస్టు, వ్వవసాయ శాస్త్రవేత్తలు ఇలా అన్ని రకాల చదువులను తాము చదవగలం కానీ.. అందుకు తగ్గ ఫీజులే భారం అంటూ అంగలార్చిన పేద విద్యార్థులకు ఆయన విద్యాదాతగా మారారు. పేద విద్యార్థులకు కార్పోరేట్ కాలేజీల్లో విద్యను ఉచితంగా అందించాడు. ఇలా ఒక్కటి కాదు అనేక ప్రజాహిత కార్యక్రమాలకు ఆయన అద్యుడయ్యాడు. అందకనే ఆరాధ్యుడయ్యాడు.

తన తండ్రి మాదిరిగానే పేదలకు తొమ్మిది రకాల ప్రజాహిత పథకాలను అందించిన ముఖ్యమంత్రి కూడా తండ్రిబాటలోనే నడిచాడు. పథకాల విషయంలో.. రాష్ట్రం బడ్జెట్ అంతంతమాత్రంగానే వున్నా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని పూనుకున్న ప్రభుత్వం.. ముందుగా పథకాలనే ప్రవేశపెట్టింది. ప్రజల మనన్నలను పోందుతోంది. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రప్రజానికమే తమ వైపు వున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల అభ్యరులకు ఓట్లు ఎవరు వేస్తారు.? అసలు వారికి ఓట్లు సంగతి పక్కన బెడితే.. ఇన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేసినప్పుడు వారికి డిఫాజిట్లు ఎలా వస్తాయి.

విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్లే రాని తరుణంలో.. ఎన్నికలలో వారు పాల్గోంటే మాత్రం వచ్చే నష్టమేమిటీ.? ఇక వారిని అడ్డుకుని.. నామినేషన్ పత్రాలు తీసుకోకుండా అవాంతరాలు సృష్టించాల్సిన అవసరం ఎందుకు.? ఈ ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల మదిలో మెదులుతున్నాయి. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు ఇలా ఏ జిల్లా చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతటా అధికార పక్షానిదే జులుం.. రాష్ట్రమంతా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ యోచిస్తోందా.? లేక ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నట్లు.. సీమ ప్రాంతంలోనే కనుమరుగు అవుతున్న ఫాక్షనిజాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి.. తమ అజమాయిషీ నిత్యం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోందా.? అన్నది రాష్ట్ర ఓటరు తమ ఫలితాలతోనే తేల్చాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh