Yes Bank crisis: ED rides creates tensions in ac holders యస్ బ్యాంకు సంక్షోభంపై తనకు సమాచారం లేదన్న వ్యవస్థాపకుడు

Yes bank crisis center actions create tension in account holders

Yes Bank Ltd, Rana Kapoor, Yes Bank founder, ED Raids, Dewan Housing Finance Ltd, Yes Bank founder Managing Director, moratorium, withdrawl capping, Reserve Bank of India, Business news, economy news, finance news, banking news Politics

Union Government orders RBI to give detailed report of YES Bank debts, and issues orders to take necessary action on Bank founder, MD and directors, as a part ED made searches on rana kapoor house. This creates tension in account holders.

యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

Posted: 03/07/2020 06:54 PM IST
Yes bank crisis center actions create tension in account holders

యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల పైచిలుకుకు చేరకున్నాయి. ఇంతలా నష్టాలు ఎందుకు వచ్చాయన్న విషయంపై దర్యాప్తు చేస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు.. బ్యాంకులో సొమ్మను దాచుకున్న ఖాతాదారులు అందోళనకు గురవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా మారటోరియం విధించడంతో పాటు నగదు విత్ డ్రాపై పరిమితిని విధించింది. ఈ అదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా పేర్కొంది.

ఈ బ్యాంకు అంతకుముందు వున్న నష్టాలతో పోల్చితే.. బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలోనే ఆర్థిక సంక్షోభలోకి కూరుకుపోయిందన్న అరోపణలు వస్తున్నాయి. యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ చేస్తున్న ప్రకటనలు ఖాతాదారులను సంతృప్తిపరుస్తూ.. ధైర్యాన్ని ఇస్తుంటే.. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న దాడులు.. ఖాతాదారుల్లో ఒకవిధమైన భయాందోళనను కలిగిస్తున్నాయి. ఓవైపు వారు ఖాతాదారుల సోమ్ము భద్రంగానే వుందని అంటున్నా.. మరోవైపు ఈడీ దాడులు.. మాత్రం ఏదో జరుగుతుందన్న సందిగ్ధతలోకి ఖాతాదారులను నెట్టివేస్తున్నాయి.

యస్ బ్యాంకు ఖాతాదారుల సోమ్ము భద్రంగా వుందని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు ఈడీని రంగంలోకి దింపి బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంపై దాడులు చేయించడంతో ట్విస్టు ఏమై ఉంటుందని ఖాతాదారుల నుంచి ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదే తరుణంలో అటు యస్ బ్యాంకు నష్టాలపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆర్బీఐని కేంద్రం అదేశించింది. ఇక ఈ సమయంలో నష్టాలకు ఈ బ్యాంకు నుంచి పలు సంస్థలకు వెళ్లిన రుణాలపై కూడా దృష్టి సారించిన కేంద్రం.. ఈ మేరకు ఈడీని రంగంలోకి దింపి ఎక్కడైనా క్విడ్ ప్రోకో.. కిక్ బ్యాగులు లభించాయా.? అన్న విషయంలోనూ దర్యాప్తు చేయాల్సిందిగా అదేశించింది.

ఈ క్రమంలో బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ పై మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ.. కపూర్ నిర్వహణలో బ్యాంకు ఎంత మేరకు నష్టాల్లోకి వెళ్లింది.. అందుకు కారణాలు ఏంటన్న విషయాలపై కూడా దర్యాప్తు చస్తోంది. ఈ క్రమంలో ఆయన హయాంలో బ్యాంకు దివాన్ హజింగ్ ఫైన్సాన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) సంస్థకు మంజూరు చేసిన రుణాల అంశం తెరపైకి వచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ ఏకంగా రూ.12.733 కోట్ల రూపాయలను 80 షెల్ కంపెనీల్లో ఏకంగా లక్ష మంది ఫేక్ రుణగ్రస్తుల ద్వారా పెట్టుబడులు పెట్టించిందని.. ఈ లావాదేవీలన్నీ 2015లో జరిగాయని కూడా ఈడీ గుర్తించిందని సమాచారం.

యస్ బ్యాంకు దర్యాప్తులో కపిల్ వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ లను కూడా నిందితులుగా పేర్కోన్న ఈడీ.. వీరద్దరూ ఐదు సంస్థలకు చెందిన షేర్లను కొనుగోలు చేశారని కూడా తేల్చింది. ఫెయిత్ రియల్టర్, మార్వెల్ టౌన్ షిప్, అబె రియాల్టీ, పోస్ ఐడన్ రియాల్టీ సహా రామ్డన్ రియల్టర్స్ సంస్థల షేర్లను కొనుగోలు చేశారని, అవి వేరే సంస్థలతో సబ్ లింక్ చేసివున్నాయని అన్నారు. ఈ ఐదు సంస్థలు జూలై నాటికే రూ.2186 కోట్ల రూపాయల రుణాల డిఫాల్టర్లుగా వున్నాయని ఈడీ పేర్కోంది. ఇక మరోవైపు రానా కపూర్ పై ఈడీ అధికారులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆర్థిక విధానాల నేపథ్యంలో బ్యాంకులు తిరోగమనంలోకి సాగుతున్నాయని అరోపించారు. యస్ బ్యాంకు సంక్షోభానికి పూర్తిగా ప్రధాని మోదీనే బాధ్యత వహించాలని అన్నారు. ఆయన ప్రధానిగా కొనసాగుతున్న క్రమంలోనే ఈ బ్యాంకు తీవ్రనష్టాల్లోకి కూరుకుపోయిందన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నేతలు మరిన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. యస్ బ్యాంకు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్రం కొత్త ఎత్తులు వేస్తోందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh