Does PM Modi Back door comments Reiterates BJP in Goa ఇవాళ కర్ణాటక, రేపు మహారాష్ట్ర.. మరీ గోవా..?

Does pm back door comments reiterates bjp in goa

modi in jharkhand, modi jharkhand rally, modi jharkhand visit, narendra modi, jharkhand bypolls, jharkhand byelection, PM Narendra Modi, Karnataka by poll Results, Jharkhand, ballot papers, EVMs, Opposition parties, Congress, JD Secular, Peoples Mandate, Politics

PM Narendra Modi accused the Congress of stealing people’s mandate in Karnataka through back door, contending that the party has been taught a lesson in the just-concluded bypolls. Does this words applicable to own party in Goa.

ఇవాళ కర్ణాటక, రేపు మహారాష్ట్ర.. మరీ గోవా..?

Posted: 12/09/2019 06:45 PM IST
Does pm back door comments reiterates bjp in goa

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో దేశంలోని జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రభావంపై చూపనుందా.? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుస్తిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. అయితే ఈ విషయం ఎవరు చెప్పినా.. లేకపోయినా.. స్వయంగా ప్రధాని ఎన్నికల సభల్లో చెప్పడంతో.. దాని ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై వుంటుందన్నది కాదనలేని సత్యం. అయితే దీనిని వ్యతిరేకించేవారు లేకపోలేరు.

దేశ ప్రజలు బిజేపిని పట్ల ఏ స్థాయిలో విశ్వసాన్ని ఏర్పర్చుకున్నారో అని ప్రధాని మోదీ చెప్పడంలో ఎలాంటి అక్షేపణ లేకపోయినా.. అంతటి నమ్మకమే కనక వుంటే బీజేపి కూడా ఒక మెట్టు దిగివచ్చి వారి సత్తాను చూపించవచ్చుకదా.. అని ప్రశ్నించేవాళ్ల సంఖ్య కూడా దేశంలో వుంది. డిసెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఇవాళ చేపట్టగా, అందులో 12 స్థానాలు గెలుచుకున్న బీజేపి విజయఢంకా మ్రోగించింది. కాగా, రెండు స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిన విషయం పాఠకులకు తెలిసిందే.

అయితే ప్రజల్లో ఇంత అధరాభిమానం వున్న బీజేపి పార్టీ రానున్న ఎన్నికలలో అరోపణలు ఎదుర్కోంటున్న ఈవీఎం మెషీన్లతో కాకుండా పటిష్ట బందోబస్తు మధ్య బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలను నిర్వహించే ఏర్పాటు చేయగలదా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనికి ఇది తమ పరిధిలోని అంశం కాదని, ఎన్నికల కమీషన్ నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పార్టీలు నడవాల్సివుంటుందన్న ‘ నో కామెంట్ ’ తరహా డైలాగులు చెప్పి తప్పించుకోవడం వారికి తెలిసిందే. అయితే ప్రజామోదం వున్న తరుణంలో విపక్షాల అరోపణలను బలంగా ఖండించేందుకు వీలుగా ఈవీఎంలపై కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి కూడా సత్తా చాటుకోవచ్చును కదా.? అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇక ఇదే తరుణంలో రాజకీయ సుస్థిరత అన్న పదాన్ని గత కొన్ని దశాబ్దాలుగా వినియోగించిన కాంగ్రెస్.. చతికిల పడిన నేపథ్యంలో దానిని బీజేపి హైజాక్ చేసిందన్న విమర్శలు వున్నాయి. అయితే ప్రజల తీర్పుని కాదని అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌కు కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజల అభీష్టాన్ని తిరస్కరించిన వారికి ఈ ఫలితాలు ఓ సందేశం లాంటివని పరోక్షంగా మహారాష్ట్ర ను సంధిస్తూ వ్యాఖ్యలు చేశారు. త్వరలో వారికి కూడా తగిన సమాధానం లభిస్తుందన్నారు.

బిజేపికి దక్షిణాదిన స్థానం లేదని విమర్శించిన వారికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. ఇదే విషయంలో గోవాలో జరిగిన పరిణామాలపై మాత్రం ఏమీ మాట్లాడలేదు. అయితే ప్రధాని హోదాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు గోవాను పరిగణలోకి తీసుకుంటే తన పార్టీకే ఇబ్బందికర పరిణామాలు ఎదురుకావచ్చు. గోవా విషయంలో బీజేపి అత్యధిక స్థానాలు వచ్చిన ( ప్రధాని పరిబాషలో చెప్పాలంటే..) కాంగ్రెస్ కు అధికారం ఇవ్వకుండా బీజేపి లాక్కున్న విషయాన్ని మర్చిపోయారా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి గోవా ఎన్నికల సమయానికి బీజేపి ఇదే స్టాండుపై వుంటుందా.? లేక మరో స్టాండ్ తీసుకుంటుందా.? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles